సెల్ఫీ షాకింగ్: ఫోన్ క్లిక్ చేయబోయి, తుపాకీ మీట నొక్కాడు

చంఢీగఢ్: పంజాబ్‌లో దారుణం జరిగింది. వినూత్నంగా సెల్ఫీ దిగాలనే కోరికతో ఓ బాలుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వినూత్న సెల్ఫీల కోసం ప్రయత్నిస్తూ ఇటీవల పలువురు మృత్యువాత పడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పంజాబ్‌‍లో పదిహేనేళ్ల బాలుడు సెల్ఫీ మోజుతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

సెల్ఫీ మోజు కారణంగా ప్రమాదవశాత్తూ తలలోకి తూటా దిగి అతను ఆసుపత్రి పాలయ్యాడు. పఠాన్‌కోట్‌కు చెందిన రమణ్ దీప్ సింగ్ అనే పదో తరగతి విద్యార్థి తన తండ్రి రివాల్వర్‌తో సెల్ఫీ దిగాలని భావించాడు. శనివారం నాడు రివాల్వర్ తలకు గురి పెట్టుకొని సెల్ఫీ దిగాలనుకున్నాడు.

 Boy accidentally shoots himself in head while taking selfie

తుపాకీని తలకు పెట్టుకొని సెల్ఫీ దిగే క్రమంలో సెల్ ఫోన్ కెమెరాను క్లిక్ మనిపించే బదులు అతను రివాల్వర్ మీటను నొక్కాడు. అతడు దానిని తలకు గురి పెట్టుకొని ఉన్నాడు. ఫోన్‌కు బదులు తుపాకీ మీట నొక్కడంతో అతని తలలోకి తూటా దూసుకుపోయింది.

తీవ్రంగా గాయపడ్డ అతనిని కుటుంబ సభ్యులు లుథియానాలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి ఉన్నట్లు వైద్యులు చెప్పారు. రమణ్ దీప్ సెల్ఫీ బదులు రివాల్వ్ర తూటాను నొక్కాడని, దీంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+