ఏమేయ్, మన ఫోటోలు వైరల్ చెయ్యాలా ? వద్దా ? నువ్వు ?, బాయ్ ఫ్రెండ్ బ్లాక్ మెయిల్ !
బెంగళూరు/తుమకూరు: కాలేజ్ లో చదువుకునే సమయంలో ఆ అమ్మాయికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. తరువాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందే సినిమాలు, షికార్లు, పార్క్ లు, విహారయాత్రలకు తిరిగి సెల్ఫీలు తీసుకున్నారు. పెళ్లికి అమ్మాయి ఇంట్లో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలతో ప్రియుడు బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టాడు. రెండు వైపుల టార్చర్ తో యువతి విసిగిపోయింది.
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కుణిగల్ కు చెందిన ఆశా (22) అనే యువతి కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకుని బాగలకుంటే సమీపంలో నివాసం ఉంటున్నారు. బెంగళూరులోనే చదువు కున్న ఆశాకు ఐదు సంవత్సరాల క్రితం అవినాష్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. రానురాను అవినాష్, ఆశా ప్రేమించుకున్నారు.

చదువు పూర్తి చేసుకున్న ఆశా బెంగళూరులోని మంత్రిమాల్ లో ఉద్యోగంలో చేరింది. ప్రతిరోజు ఉద్యోగానికి వెలుతున్న ఆశా ఆమె ప్రియుడు అవినాష్ తో కలిసి తిరిగింది. ప్రేమికులు ఆశా, అవినాష్ ఇప్పటికే పార్క్ లు, సినిమాలు, షికార్లు, విహారయాత్రలకు తిరిగేశారు. ప్రియురాలు ఆశా ఏకాంతంగా ఉన్న సమయంలో అవినాష్ ఆమెకు తెలీకుండా ఆమె అశ్లీల ఫోటోలు తీసిపెట్టుకున్నాడు.
ఇటీవల ఆశా లవ్ స్టోరీ ఆమె కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. చూడమ్మ మనకు ప్రేమ, దోమా లాంటివి పట్టవు. మనం మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్లము, మేము చూసిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలని, నీ ప్రియుడిని నువ్వు మరిచిపోవాలని కుటుంబ సభ్యులు ఆశాకు బుద్దిమాటలు చెప్పారు.

మన పెళ్లికి మా ఇంట్లో అంగీకరించడం లేదని, మనం విడిపోదామని ఆశా ఆమె ప్రియుడు అవినాష్ కు నచ్చచెప్పింది. అయితే అవినాష్ రగిలిపోయాడు. ఏమేయ్ తమాషాలు చేస్తున్నావా ?, ఇంతకాలం నాతో ఇష్టం వచ్చినట్లు తిరిగి ఇప్పుడు మా ఇంట్లో పెళ్లికి అంగీకరించలేదు, నేను మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అంటావా ? అంటూ అవినాష్ అతని గర్ల్ ఫ్రెండ్ ఆశా మీద చిందులు వేశాడు.
నన్ను ప్రేమించకముందు నువ్వు అన్ని ఆలోచించుకోవాలని, ఇప్పుడు అన్ని అయిపోయిన తరువాత డ్రామాలు ఆడుతున్నావా, మనం ఏకంతంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని, జీవితంలో ఎవ్వరూ నిన్ను పెళ్లి చేసుకోకుండా చేస్తానని అవినాష్ అతని ప్రియురాలు ఆశాను బెదిరించాడు.
లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడం, ఇంతకాలం ప్రేమించిన ప్రియుడు బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టడంతో ఇరువైపుల టార్చర్ తట్టుకోలేక ఆశా కుమలిపోయింది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆశా ఫ్యాన్ కు వేల్ తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న బాగల్ కుంటే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రియురాలు ఆశాను బ్లాక్ మెయిల్ చేసిన ఆమె ప్రియుడు అవినాష్ పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications