బ్రహ్మోస్ మిస్సైల్ మిస్ ఫైర్ ఇన్సిడెంట్.. ముగ్గురు అధికారులపై వేటు
బ్రహ్మోస్ క్షిపణి మిస్ ఫైర్‌కు సంబంధించి రక్షణశాఖ చర్యలు తీసుకుంది. ముగ్గురు ఐఏఎఫ్ అధికారులను సర్వీస్ నుంచి తొలగించింది. మార్చి 9వ తేదీన మూడు మిసైల్స్ పొరపాటున మిస్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. దానికి బాధ్యత వహిస్తూ.. ముగ్గురిపై చర్యలు తీసుకుంది.

ఆ ముగ్గురిలో గ్రూప్ కెప్టెన్, ఇద్దరు వింగ్ కమాండర్లు ఉన్నారు. ఈ ఏడాది మార్చి 9వ తేదీన ఘటన జరగగా.. వాస్తవాలను నిర్ధారించేందుకు వేసిన కమిటీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ విచారణ చేపట్టింది. బాధ్యత నిర్వహించడంతోపాటు.. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ నుంచి తేడా ఉన్నాయని గుర్తించారు. క్షిపణిని యాక్సిడెంటల్‌గా ఫైర్ చేశారు.
ఘటనకు ఆ ముగ్గురు అధికారులు బాధ్యులు అని కమిటీ పేర్కొంది. అందుకోసమే వారి సర్వీసును రద్దు చేస్తున్నామని తెలిపింది. వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. బ్రహ్మోస్ క్షిపణి పాకిస్థాన్‌లో గల మియను చాన్నులో పడిన సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఘటనపై భారత దేశం దర్యాప్తునకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకుంది.












Click it and Unblock the Notifications