BRICS: బ్రిక్స్ సదస్సులో ఆఫ్గనిస్తాన్‌పై ఢిల్లీ డిక్లరేషన్-కీలక నిర్ణయాలు-పుతిన్,జిన్‌పింగ్ రియాక్షన్ ఇదే...

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్‌గా జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ పేరుతో ఆఫ్గనిస్తాన్‌లో శాంతి,మానవ హక్కుల రక్షణకు భారత్ ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ్య దేశాలు ఆమోదించాయి. ఆఫ్ఘనిస్థాన్‌ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని ఈ తీర్మానం ద్వారా నిర్ణయించారు. బహుపాక్షిక వ్యవస్థల సంస్కరణ,కౌంటర్ టెర్రరిజం,సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధనలో డిజిటల్,సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం,పర్యావరణ సమస్య వంటి అంశాలపై సదస్సులో ప్రధానంగా చర్చించారు.

'ఆఫ్గనిస్తాన్‌లో నెలకొన్న ప్రస్తుత పరిణామాలను మేము ఆందోళనతో గమనిస్తున్నాం. హింసకు దూరంగా శాంతియుత పద్దతిలో ఆఫ్గనిస్తాన్‌ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని పిలుపునిస్తున్నాం. అంతర్గత చర్చల ద్వారా ఆఫ్గనిస్తాన్‌లో శాంతి,సుస్థిరత,శాంతిభద్రతలను పరిరక్షించుకోవాలని మేము చెబుతున్నాం.' అని ఢిల్లీ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. బ్రిక్స్ కౌంటర్ టెర్రరిజంలో భాగంగా ఆఫ్గనిస్తాన్‌ను ఉగ్రవాదుల అడ్డాగా మారకుండా,పొరుగు దేశాలకు అక్కడి నుంచి ఎలాంటి ముప్పు తలెత్తకుండా.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్నిడిక్లరేషన్‌లో హైలైట్ చేశారు. ఆఫ్గన్‌లో చిన్నారులు,మహిళలు,మైనారిటీల హక్కులతో పాటు మానవ హక్కులను పరిరక్షించాల్సిన అవసరాన్ని తీర్మానంలో పేర్కొన్నారు.

brics summit delhi declaration on afghanistan for peace and stability

మాదక ద్రవ్యాల రవాణాకు,ఉగ్రవాదానికి ఆలవాలంగా ఉన్న ఆఫ్గనిస్తాన్ పొరుగు దేశాలకు ముప్పుగా పరిణమించవద్దని డిక్లరేషన్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ది చెందుతున్న దేశాలకు బ్రిక్స్ ప్రభావవంతమైన గొంతుకగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. గడిచిన దశాబ్దంన్నర కాలంలో బ్రిక్స్ చాలానే సాధించిందన్నారు. వచ్చే 15 ఏళ్లలో బ్రిక్స్‌ మరింత ఉత్పాదకతను సాధించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ... ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో కొత్త సంక్షోభానికి తెరలేచిందని పుతిన్ అభిప్రాయపడ్డారు.బ్రిక్స్ సభ్య దేశాల్లాగే ఆఫ్గన్ గడ్డపై శాంతి,సుస్థిరత స్థాపనకు రష్యా నిరంతరం మాట్లాడుతూనే ఉందన్నారు. ఆఫ్గన్ ప్రజలు దశాబ్దాల పోరాటం చేశారని... తమ దేశం ఎలా ఉండాలో నిర్వచించుకునే హక్కు వారికి ఉందని అన్నారు.

గడిచిన 15 ఏళ్లలో వ్యూహాత్మక కమ్యూనికేషన్,రాజకీయ విశ్వసనీయత,సమగ్రత,సమానత్వ స్పూర్తిని బ్రిక్స్ దేశాలు మరింత ముందుకు తీసుకెళ్లాయని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్ దేశాలు కీలక శక్తిగా ఎదిగాయన్నారు. వచ్చే ఏడాది జరిగే బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షత వహిస్తుందన్నారు.

Recommended Video

    ప్రధాని మోదీ విధానాలపై మండి పడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత ఖర్గే

    ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా పాల్గొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+