పెళ్లికూతురి ప్రాణం తీసిన పాత బాయ్ ఫ్రెండ్, పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఏం చేశాడంటే?

నిశ్చితార్థం చేసుకున్న యువతి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని అనేకల్ తాలూకా జిగణి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చంద్రకళ (19) అనే యువతి దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అన్నారు. తమ కుమార్తె ఆత్మహత్యకు అరుణ్ కుమార్ కారణమని చంద్రకళ తల్లిదండ్రులు జిగణి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

జిగణి సమీపంలోని నంజాపూర్‌లో నివాసం ఉంటున్న చంద్రకళ, నిందితుడు అరుణ్‌కుమార్‌లు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. చంద్రకళ, అరుణ్ కుమార్ కు చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉండటం, ఇద్దరు ప్రేమించుకోవడంతో ఇద్దరూ బయట హ్యాపీగా తిరిగేవాళ్లు. చాలాకాలంగా ప్రేమికులు సినిమాలు, షికార్లకు తిరుగుతున్నారని తెలిసింది. ప్రేమికులు చంద్రకళ, అరుణ్ కుమార్ ల విషయం ఇరువైపుల స్నేహితులతో పాటు వారి కుటుంబ సభ్యులకు తెలిసింది.

Bride committed suicide with ex-boyfriend torture near Bengaluru city

అయితే ఈ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో ఆమె కుమార్తె చంద్రకళకు బుద్దిమాటలు చెప్పారు. అరుణ్ కుమార్ జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడని చంద్రకళ కుటుంబ సభ్యులకు తెలిసింది. అరుణ్ కుమార్ వ్యక్తిత్వం సరిగా లేదని, నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే జీవితంలో లేనిపోని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని, మేము చూసిన పెళ్లికొడుకును నువ్వు పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు చంద్రకళకు నచ్చచెప్పారు.

నిందితుడు అరుణ్ కుమార్ అతని ప్రియురాలు చంద్రకళ ఇంటి పక్కలోనే అతని కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. చంద్రకళ తల్లిదండ్రులు వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్న మరో యువకుడితో ఆమె నిశ్చితార్థం చేసి పెళ్లి చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఇప్పటికే చంద్రకళ నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న నిందితుడు అరుణ్ నువ్వు నన్ను కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపేస్తానని చంద్రకళను బెదిరించాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అరుణ్ కుమార్ మా కుమార్తె చంద్రకళను బెదిరించడమేకాకుండా ఆమెను బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ఆమె ఆవేదనతో ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె చంద్రకళ మృతికి అరుణ్ కుమార్ కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు జిగణి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిగణి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చంద్రకళ ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న అరుణ్ కుమార్ పరారైనాడని, చంద్రకళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని జిగణి పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+