శోభనం రాత్రి భర్తకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఆమె ఏం చేసిందంటే

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో :వివాహమై రెండు రోజులు కూడ కాలేదు. కొత్త దంపతులకు తొలి రాత్రి ఏర్పాటు చేశారు కుటుంబసభ్యులు. అయితే తొలి రాత్రి రోజున భర్త అదమరిచి నిద్రపోయాడు. ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను తీసుకొని పెళ్ళి కూతురు పారిపోయింది. ఈ ఘటనలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

కొత్త దంపతులు ఆలస్యంగా నిద్రలేస్తారని వరుడి కుటుంబసభ్యులు కూడ వేచిచూశారు. అయితే ఎంతకీ కొడుకు కోడలు అలికిడి లేకపోవడంతో అనుమానంతో ఆ గదిలోకి వెళ్ళి చూసేసరికి వారు షాక్ కు గురయ్యారు.

 bride escape along with seventy thousand, ornaments

ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలోని మోదీనగర్ కు చెందిన పంకజ్ కు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో బుదవారం నాడు వివాహమైంది. వివాహం జరిగిన తర్వాత సంప్రదాయం ప్రకారం తొలి రాత్రిని ఏర్పాటు చేశారు వరుడు కుటుంబసభ్యులు.

వరుడి ఇంట్లో తొలి రాత్రి రోజున పంకజ్ కు అతని భార్య పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. ఈ నిద్రమాత్రలున్న పాలు తాగిన పంకజ్ స్పృహ తప్పిపోయాడు. ఇదే అదనుగా భావించిన ఆయన సతీమణి ఇంట్లో ఉన్న 77 వేల రూపాయాల నగదును 175 గ్రాముల బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. నవవధువు ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదని వరుడి కుటుంబసభ్యులు చెబుతున్నారు.వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
pankaj married a lady on wednesday in ghajiyabad, on thursday night pankaj family members didnot identify the bride . pankaj parents enter in to pankajs room in the room pankaj unconsasetion stage. pankajs wife along with 77 thousand rupees of currency, ornaments escape, pankaj parents complient agaist the pankajs wife.
Please Wait while comments are loading...