Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాకింగ్: శోభనం రాత్రే అత్తారింటి నుంచి వధువు పరార్!

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా నహటౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 30న జరిగిన వివాహానికి సంబంధించిన ఉదంతం స్థానికంగా పెనుసంచలనం సృష్టించింది. వివాహం జరిగిన మరుసటి రోజు డిసెంబర్ 1న అత్తవారింటికి వచ్చిన నవవధువు అదే రోజు రాత్రి శోభనం సమయంలో అకస్మాత్తుగా అదృశ్యం కావడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

వధువు అత్తవారింటికి చేరుకున్నాక రోజంతా సాధారణంగానే ఉంది. కానీ రాత్రి నిద్ర నుంచి మేల్కొన్న భర్తకు ఆమె గదిలో కనిపించలేదు. ఈ ఊహించని పరిణామంతో అత్తవారింట్లో కలకలం రేగింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు, అత్తమామలు, పుట్టింటివారు కలిసి ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1.30 గంటల ప్రాంతంలో వధువును గ్రామం బయట రోడ్డుపై ఒంటరిగా గుర్తించారు.

Bride Goes Missing on First Night Bijnor Incident Ends in Family Settlement

ఆమె అదృశ్యంపై పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. ఈ విచారణలో ఎవరైనా ఆమెపై బలవంతం చేశారనేందుకు లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగిందనేందుకు ఆధారాలు లభించలేదు. వధువు స్వయంగా వెళ్లిపోయిందని పోలీసులు నిర్ధారించారు. వధువు అదృశ్యం కావడానికి గల కారణాలు తెలియకపోయినా, ఆమె తిరిగి వచ్చిన తర్వాత ఇరు కుటుంబాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అత్తమామల వైపువారు వధువు ప్రవర్తన సరిగా లేదని ఆరోపణలు చేశారు. ఈ ఊహించని అదృశ్యం ఆమెపై అనుమానాలకు తావిచ్చిందని వారు ప్రశ్నించారు.

దీనికి ప్రతిగా పుట్టింటివారు తమ కుమార్తె నిర్ణయాన్ని, ఆమె భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ అభ్యంతరం తెలిపారు. వధువు దొరికిన తర్వాత కూడా, ఆమె 'తప్పుడు ప్రవర్తన' కారణంగా భర్త ఆమెతో కలిసి జీవించడానికి స్పష్టంగా నిరాకరించాడు. ఈ నిరాకరణతో వివాదం మరింత పెరిగింది.

సుదీర్ఘ చర్చల తర్వాత పరస్పర రాజీ
మంగళవారం రోజున ఇరుపక్షాల మధ్య పోలీస్ స్టేషన్‌లో రోజంతా వాదోపవాదాలు, చర్చలు కొనసాగాయి. చివరికి నహటౌర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ధీరజ్ నాగర్ సమక్షంలో ఇరు కుటుంబాలు పరస్పర అంగీకారంతో (Compromise) రాజీకి వచ్చాయి.

ఒప్పందం వివరాలు: ఈ ఒప్పందంలో, ఇరుపక్షాలు ఈ విషయంలో ఎటువంటి పోలీసు చర్య (FIR) కోరకూడదని నిర్ణయించుకున్నాయి. యువకుడు ఆమెతో కలిసి జీవించడానికి నిరాకరించడంతో, వధువును ఆమె పుట్టింటి వారికి అప్పగించారు.ఈ వ్యవహారం రాజీతో ముగిసిందని, ప్రస్తుతం ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఎస్‌హెచ్‌ఓ ధీరజ్ నాగర్ ధ్రువీకరించారు. పెళ్లైన మరుసటి రోజే, శోభనం సమయంలో వధువు అకస్మాత్తుగా ఇంటి నుంచి వెళ్లిపోవడం, ఆ తర్వాత భర్త నిరాకరించడంతో ఈ వివాహం కొద్ది రోజుల్లోనే రద్దు కావడానికి దారితీసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+