పెళ్లికి ముందు తప్పతాగి వరుడు డీజే డ్యాన్సులు; మరొకరిని పెళ్ళాడి షాకిచ్చిన వధువు!!
ఇటీవల కాలంలో అమ్మాయిలు పెళ్లిళ్ల విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెళ్లి పీటల మీదనే అమ్మాయిలు తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఓ పెళ్లిలో కూడా వధువు తీసుకున్న నిర్ణయం వరుడికి ఊహించని షాక్ ఇచ్చింది.

రాజస్థాన్ లో వరుడికి షాక్ ఇచ్చిన వధువు
రాజస్థాన్‌లోని చురులో జరిగిన ఒక విచిత్రమైన సంఘటనలో, వరుడు తాగి డ్యాన్స్ చేస్తూ ఉన్న కారణంగా బారాత్‌ను ఆలస్యం చేయడంతో విసిగిపోయిన వధువు పెళ్లిని రద్దు చేయాలని నిర్ణయించుకుంది. వధువు అదే సమయంలో మరొక వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొని పెళ్లికి వచ్చిన బంధువులలో ఒక యువకుడితో పెళ్లికి ఓకే అంది. తాగి తందనాలు ఆడుతూ వివాహ సమయానికి వేదిక వద్దకు రాకుండా ఉన్న వరుడిని నిరాకరించి ఊహించని షాక్ ఇచ్చింది. అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే

పెళ్ళికి ముందు బరాత్.. తాగి డీజే డ్యాన్సులలో మునిగిపోయిన వరుడు
రాజస్థాన్‌లోని చురులోని రాజ్‌గఢ్ తహసీల్‌కు చెందిన చెలనా గ్రామంలో మే15న హర్యానాలోని సివానీలో నివాసం ఉంటున్న వరుడు అనిల్ మహావీర్ జాట్ స్థానిక అమ్మాయి మంజుతో తన వివాహానికి చెలానా చేరుకున్నాడు. పెళ్లికూతురు ఇంటికి చేరుకోగానే దాదాపు 150మందికి పైగా బారాత్‌లో పాల్గొని డీజేకు డ్యాన్స్‌లు చేశారు. వరుడి బృందం రాత్రి 9గంటలకు వధువు ఇంటికి బయలుదేరింది. అయితే వారు రాత్రి ఒంటి గంట వరకు డ్యాన్స్ చేస్తూనే డీజే డాన్స్ లో మునిగిపోయారు.

వివాహ ముహూర్తం దాటిపోయినా డ్యాన్సులు ఆపని వరుడు
వరుడు మరియు అతని స్నేహితులు కొందరు మద్యం తాగి, డ్యాన్స్ చేయడం కొనసాగించారు. దీనివల్ల ఊరేగింపు ఐదు గంటలపాటు ఆలస్యమైంది. 1:15 AM కి వివాహ వేడుకకు సంబంధించిన శుభ ముహూర్తం బాగా, తప్పతాగి వరుడు చేసిన డ్యాన్స్ కారణంగా ముహూర్తం కూడా తప్పిపోయింది. అయినప్పటికీ, వరుడి వివాహ వేదిక వద్దకు చేరుకోలేదు. మద్యం మత్తులో ఉన్న వరుడు మరియు అతని స్నేహితులు పార్టీలో మునిగితేలడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు అతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది

వరుడికి షాక్ ఇస్తూ వేరొకరిని పెళ్లి చేసుకున్న వధువు.. వివాహ వేడుకలో రచ్చ
ఆమెతో సహా వధువు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర నిరాశకు లోనైన వారు పెళ్లిని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వధువు తప్పతాగి డాన్సు చేస్తున్న వరుడికి షాక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే వివాహానికి వచ్చిన మరో యువకుడితో ఆమె పెళ్లి జరిగింది. వేదిక వద్దకు చేరుకున్న తర్వాత, వరుడు తన వధువు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం చూసి షాక్ అయ్యాడు.

వధువు కుటుంబంపై ఫిర్యాదు
వరుడి తరపు వారు అవమానంతో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. అయినప్పటికీ, తనను అవమానించారంటూ వరుడి కుటుంబ సభ్యులు రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో వధువు కుటుంబంపై ఫిర్యాదు చేశారు. పెళ్లికి ముందే వరుడు పరిస్థితి ఇలా ఉంటే, పెళ్లి అయిన తరువాత ఎలా ఉంటుందో అంటూ వధువు తరపు బంధువులు వరుడి కుటుంబం పై విరుచుకుపడ్డారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications