కాంగ్రెస్ లోకి బీఎస్ యడియూరప్ప, పక్కా క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం, వయసులో !
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే జగదీష్ శెట్టర్, లక్ష్మణ సవదికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చేసింది. ఇక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఓ సీనియర్ నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు శామనూరు శివశంకరప్ప మీడియాతో మాట్లాడుతూ లక్ష్మణ సవది, జగదీష్ శెట్టర్ బాటలోనే మాజీ సీఎం యడియూరప్ప కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని అన్నారు. ఈ విషయంలో మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప స్పందించారు. తాను ఈ జన్మలో కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటూ జరగదు అని స్పష్టం చేశారు.

మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మంగళవారం శివమొగ్గలో మీడియాతో మాట్లాడారు. శామనూరు శివశంకరప్పకు 92 ఏళ్ల వయసు అయిపోయిందని, ఆయన అంటే తనకు చాలా గౌరవం ఉందని. ఆయన అప్పుడప్పుడు జోకులు వేస్తుంటారని, ఇప్పుడు కూడా తాను కాంగ్రెస్ లో చేరుతానని జోక్ చేసి ఉంటారని యడియూరప్ప అన్నారు.
తాను బీజేపీలోనే ఉంటానని, ఈసారి కూడా పూర్తి మెజారిటీతో బీజేపీ కర్ణాటకలో అధికారంలోకి వస్తుందని బీఎస్. యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. జగదీష్ శెట్టర్ ఆవేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఆయన్న రాజ్యసభ ఎంపీని చేసి కేంద్ర మంత్రిగా మంచి పదవి ఇస్తామని బీజేపీ హైకమాండ్ చెప్పినా ఆయన మాట వినలేదని, జగదీష్ శెట్టర్, లక్ష్మణ సవది కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రానా బీజేపీకి ఎలాంటి నష్టం లేదని బీఎస్ యడియూరప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications