వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాల్గవసారి ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప...ఈసారైనా గట్టేక్కెనా...

|
Google Oneindia TeluguNews

ఎట్టకేలకు వారం రోజుల పాటు కర్ణాటక అసెంబ్లీలో మౌనంగానే ఉన్న కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు ఆ పార్టీ ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప నాలుగో సారి సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే మూడు సార్లు సీఎంగా ఎంపికైన యడ్యూరప్ప నాలుగోసారైన తన పదవిని నిలబెట్టుకుంటాడా అనే చర్చ కొనసాగుతోంది.

కర్ణాటక రాజీకీయాల్లో అంత్యంత కీలక నేతగా ఎదిగిన యడ్యూరప్ప చివరి సారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబుతున్నాడు. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన వెంటనే అసెంబ్లీ సమావేశ మందిరంలోనే బీజేఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం యడ్యురప్పను ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఆ వేంటనే గవర్నర్‌‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరాడు.
దీంతో గురువారం ఆయన్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ సైతం ఆహ్వానించడం చకచక జరిగిపోయాయి.

BS Yeddyurappa is set to be Chief Minister for the fourth time.

అంతకు ముందే సీఎంగా కుమారస్వామి రాజీనామ చేయడంతో గవర్నర్ వాజుభాయ్ వాలా వెంటనే ఆమోదించాడు. దీంతో ఆయన నాలుగో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహుర్తం ఖారారు చేశాడు. ఇందులో భాగంగానే గురువారం ఆయన కర్ణాటక సీఎం గా బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇందులోభాగంగానే యడ్యూరప్ప పార్టీ నేతలతో కలిసి సంబురాలు కూడ చేసుకున్నాడు.

అయితే 76 సంవత్సరాలున్న యడ్యూరప్పకు ఇది చివరి అవకాశంగా మారనుంది. ఎందుకంటే బీజేపీ 75 సంవత్సరాలు దాటిన వారిని క్రియాశీల రాజకీయాలకు దూరంగా పెడుతోంది. ఈ నేపథ్యంలోనే యడ్యూరప్ప గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో మేజారీటీ స్థానాలను సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని యడ్యూరప్ప నేతృత్వంలో ఏర్పాటు చేసింది. కాని అసెంబ్లీలో బల నిరూపణ చేసకోకపోవడంతో కేవలం రెండున్నర నెలల పాటు మాత్రమే యడ్యూరప్ప సీఎంగా కొనసాగారు.

ఇక అంతకు ముందు కూడ 2007 నవంబర్‌ 12 నుండి నవంబర్ 19 వరకు కేవలం ఆరు రోజులు మాత్రమే జేడిఎస్ మద్దతుతో ముఖ్యమంత్రిగా కోనసాగారు. అనంతరం ప్రభుత్వం పడిపోవడంతో గవర్నర్ పాలన విధించారు. తదనంతరం మే 30 2008 నుండి జూలై 31 2011వరకు సీఎంగా కొనసాగారు.

English summary
With smiles and victory signs, BS Yeddyurappa, who had waited patiently for a trust vote for four days and said he was prepared to sit in the assembly till midnight, is set to be Chief Minister for the fourth time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X