వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీఎస్ఎఫ్ కమాండెంట్ అరెస్ట్, రూ. 47లక్షలు సీజ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/తిరువనంతపురం: భారీ మొత్తంలో నగదు రహస్యంగా తరలిస్తున్న ఓ బీఎస్ఎఫ్ కమాండెంట్‌ను సీబీఐ అధికారులు వలపన్ని అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పనిచేస్తున్న బీఎస్ఎఫ్ కమాండెంట్ జిబు డి.మాథ్యూను కేరళలోని అలప్పుజా వద్ద అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

 BSF jawan held with Rs 47 Lakh at Alappuzha railway station

ఓ అవినీతి కేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు ఆయనపై నిఘా వేశారు. మంగళవారం అలప్పజాలో షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలు దిగగానే ఆయనను .. ఏడుగురు సభ్యుల సీబీఐ బృందం అతన్ని చుట్టుముట్టింది. ట్రాలీ బ్యాగ్‌ను చెక్ చేస్తామని వారించినా అతను వినలేదు.

దీంతో సీబీఐ బృందం అతన్ని అరెస్ట్ చేసి, దగ్గరలో ఉన్న హోటల్‌కు తీసుకువెళ్లి బ్యాగ్‌ను తెరిచింది. అరెస్టు సమయంలో జిబు వద్ద రూ.47 లక్షల మేర నగదు ఉన్నట్టు సమాచారం. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ.. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో విచారణ చేపట్టింది.

English summary
A BSF commandant was arrested by the CBI from the Alappuzha railway station with Rs 50lakh on Tuesday. Jibu D Mathew, commandant, 83 BN, BSF, was the arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X