సరిహద్దుల్లో అరుదైన టోకే గెక్కోను రక్షించిన బీఎస్ఎఫ్

BSF: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి చేపట్టిన ఒక కీలక ఆపరేషన్‌లో ఉత్తర బెంగాల్ సరిహద్దులో గల సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా ఉత్తర ఆగ్రా సరిహద్దు గ్రామంలో అరుదైన , అంతరించిపోతున్న బల్లి జాతి టోకో గెక్కోను రక్షించింది. ఈ బల్లిని పెట్టెలో దాచిపెట్టి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించగా.. బీఎస్ఎఫ్ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుని అటవీ శాఖకు అప్పగించారు.

నిఘా సమాచారం ఆధారంగా, రాయ్‌గంజ్ సెక్టార్‌లోని 79వ బెటాలియన్ బీఎస్‌ఎఫ్ బృందం అప్రమత్తమై జూన్ 26, 2025న ఈ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు 10 అంగుళాల పొడవున్న టోకే గెక్కోను ఒక పెట్టెలో దాచిపెట్టి సరిహద్దు కంచె సమీపంలో స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఈ ఘటనపై బీఎస్ఎఫ్ అధికారులు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. గెక్కోను రక్షించిన తర్వాత, దానిని తదుపరి సంరక్షణ, చట్టపరమైన విచారణల కోసం వెంటనే అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. టోకో గెక్కో వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని షెడ్యూల్ 1 కింద అత్యంత అరుదైన, అత్యధికంగా రక్షించబడిన బల్లి జాతి.

BSF Rescues Rare Tokay Gecko from Smuggling near India-Bangladesh Border

టోకే గెక్కో చాలా కాలంగా స్మగ్లర్లకు వాణిజ్య లక్ష్యంగా ఉంది. ఆసియాలోని సాంప్రదాయ వైద్య మార్కెట్లలో దీనికి డిమాండ్ ఉండటంతో, ఇది అత్యధికంగా అక్రమ రవాణా చేయబడే జీవులలో ఒకటిగా మారింది. తూర్పు ఆసియా దేశాలలో టోకే గెక్కో సాంస్కృతికంగా ముఖ్యమైనది. జానపథ కథల ప్రకారం గెక్కోకు అతీంద్రీయ శక్తులు ఉంటాయని భావిస్తారు. ఆగ్నేయాసియాలో ఇది అదృష్టం, సంతానోత్పత్తికి చిహ్నం. ఈ జాతిని కొన్ని ప్రాంతాలలో ఔషధ వ్యాపారుల కోసం వేటాడుతారు. ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో మూఢనమ్మకాలు, నిరూపించబడని ఔషధాల కోసం అక్రమ వన్యప్రాణుల వాణిజ్యంలో అధిక విలువను కలిగి ఉంది. చైనా, హాంకాంగ్, తైవాన్, వియత్నాం, మలేషియా, సింగపూర్, ఆసియాలోని ఇతర ప్రాంతాలలో ఈ జంతువుకు అధిక డిమాండ్ ఉంది,

వన్యప్రాణుల అక్రమ రవాణాకు సున్నితమైన ప్రాంతాలు ఇవే..
ఆ ప్రాంతంలో ఇలాంటి ఘటనలెన్నో జరుగుతాయి. బీఎస్ఎఫ్ సేకరించిన డేటా ప్రకారం.. ఉత్తర బెంగాల్, దానికి ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతాలు అక్రమ వన్యప్రాణుల అక్రమ రవాణాకు సున్నితమైన మండలాలుగా మారాయి. జనవరి 2024 నుంచి మే 2025 వరకు, బీఎస్‌ఎఫ్ దళాలు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి అంతరించిపోతున్న జాతుల స్మగ్లింగ్‌కు సంబంధించి అనేక ప్రయత్నాలను అడ్డుకున్నాయి. స్వాధీనం చేసుకున్న వాటిలో 400కి పైగా తాబేళ్లు, 200 సాండ్ బోవా పాములు, 279 పావురాలు, 186 విదేశీ పక్షులు, ఒక చిరుతపులి పిల్ల కూడా ఉన్నాయి.

ఈ అరుదైన గెక్కోను విజయవంతంగా అడ్డుకోవడం, రక్షించడం బీఎస్ఎఫ్ నిబద్ధతను చెబుతోంది. బీఎస్ఎఫ్ అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్ నుంచి భారత సరిహద్దులను సురక్షితంగా ఉంచడం మాత్రమే కాకుండా.. దేశ పర్యావరణ వారసత్వాన్ని కూడా పరిరక్షిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే పౌరులు ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించిన ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను సమీపంలోని బీఎస్ఎఫ్ పోస్ట్ లేదా అటవీ అధికారులకు నివేదించాలని బీఎస్ఎఫ్ విజ్ఞప్తి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+