పాకిస్థాన్ నుంచి రూ. 70 కోట్ల హెరాయిన్
చండీగడ్: పాకిస్థాన్ సరిహద్దు నుంచి భారత్ కు హెరాయిన్ తరలిస్తున్న సమయంలో బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే హెరాయిన్ తరలిస్తున్న నిందితులు తృటిలో తప్పించుకున్నారని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు.
పాకిస్థాన్ సరిహద్దులోని పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ సెక్టార్ లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితులను జవాన్లు పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే నిందితులు వారి చేతిలో ఉన్న ప్యాకెట్లు విసిరివేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు.

జవాన్లు ఆ ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఆ ప్యాకెట్లలో 14 కేజీల హెరాయిన్ ఉన్న విషయం గుర్తించి పై అధికారులకు సమాచారం ఇచ్చారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో రూ. 70 కోట్లు ఉంటుందని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు.
పాకిస్థాన్ నుంచి హెరాయిన్ పంజాబ్ మీదుగా భారత్ లోని ఇతర ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నించారని అధికారులు అన్నారు. గత ఏడాది పంజాబ్ లో బీఎస్ఎఫ్ జవాన్లు 165 కేజీలకు పైగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications