పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయం, హఠాత్తుగా లక్నోలో మాయావతితో భేటీ: ఏపీ-తెలంగాణలలో బీఎస్పీతో పొత్తు

Recommended Video

    పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయం.. మాయావతితో భేటీ ! | Oneindia Telugu

    లక్నో: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. లోకసభ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఏపీ అభ్యర్థుల పైనే దృష్టి సారించినట్లుగా కనిపించింది. కానీ శుక్రవారం హఠాత్తుగా ఆయన ఉత్తర ప్రదేశ్‌లో తేలారు. బీఎస్పీ (బహుజన సమాజ్ వాది పార్టీ) అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జనసేన, బీఎస్పీలు కలిసి పోటీ చేయాలని ఈ మరకు నిర్ణయించుకున్నాయి. భేటీ అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో బీఎస్పీకి కేడర్ ఉంది. ఈ నేపథ్యంలో కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేనతో కలిసి పోటీ చేయనున్నట్లు మాయావతి ప్రకటన చేశారు.

    https://telugu.oneindia.com/news/telangana/after-ys-jagan-now-pawan-kalyan-is-not-contesting-telangana-polls-240820.html

    ఈ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాము బహెన్ జీ మాయావతిని ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా కావడానికి ఆమె అన్ని విధాలా అర్హులు అని అభిప్రాయపడ్డారు. ఆమె ఢిల్లీ పీఠం ఎక్కాలనేది తమ కోరిక అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+