ఏ కష్టమొచ్చిందో?: రివాల్వర్‌తో కాల్చుకుని ఎంపీ కోడలు ఆత్మహత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. బీఎస్పీ నేత, రాజ్యసభ సభ్యుడు నరేంద్ర కశ్యప్ కోడలు హిమాని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని రేపింది. బుధవారం ఉదయం బాత్‌రూమ్‌లో రివాల్వర్‌తో కాల్చుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వెంటనే ఆమెను ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆమెను యశోదా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. నరేంద్ర కశ్యప్ పెద్ద కుమారుడు సంజయ్ కశ్యప్ భార్య హిమాని. హిమాని తండ్రి బీఎస్పీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
హిమాని ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదని ఘజియాబాద్ ఎస్పీ ధర్మేంద్ర సింగ్ యాదవ్ పేర్కొన్నారు. సంఘనటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications