వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ సెషన్ : హల్వా తయారుచేసిన కేంద్రమంత్రి నిర్మలా ...

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : మరోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ బడ్జెట్‌పై కసరత్తు చేపట్టింది. జూలై 5న పద్దు ప్రవేశపెట్టనుండటంతో ఇప్పటికే అందుకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఆర్థికశాఖ ప్రారంభించింది. బడ్జెట్‌కు సంబంధించి ఫైనాన్స్ మినిస్టరీ అధికారులు ఇప్పటికే ప్రిపరైనట్టు సమాచారం.

సాంప్రదాయం ..
ప్రతీ ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు హల్వా తయారు చేయడం సాంప్రదాయం. ఈసారి జూలై 5న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో అందుకు సంబంధించి కసరత్తు చేశారు. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి హల్వా తయారీని ప్రారంభించారు. అంటే ఇవాళ్టి నుంచి బడ్జెట్‌కు సంబంధించిన ప్రతులను ముద్రిస్తారు. ఇందుకోసం దాదాపు 100 మంది అధికారులు రేయింబవళ్లు శ్రమిస్తారు. మరో విషయమేమిటంటే బడ్జెట్ రూపకల్పన అత్యంత గోప్యంగా ఉండాలి కాబట్టి .. ఆర్థికశాఖ అధికారులను ఇంటికి కూడా పోనియ్యరు. అక్కడే వారికి వసతి, భోజనం అన్నీ ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు ఫోన్ సౌకర్యం కూడా ఉండదు. బడ్జెట్‌కు సంబంధించి ఏ అంశాలు బయటకు తెలియనీయొద్దనే ఉద్దేశంతో ఇంటర్నెట్, మెయిల్ సౌకర్యం కూడా ఉండదు. అయితే సీనియర్ అధికారులు మాత్రం ఇంటికి వెళ్లే వెసులుబాటు ఉంటుంది.

Budget 2019: Halwa Ceremony held at finance ministry, printing of budget documents starts

స్వీట్ అందజేసి ...
ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామాన్ తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఆర్థికశాఖ కార్యాలయంలో హల్వాను తయారుచేశారు. స్వీట్‌ను నిర్మలా దగ్గరుండి మరీ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ పార్లమెంట్ నార్త్ బ్లాక్‌లో జరుగుతుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు.

English summary
Preparations for the Union Budget 2019-20 are on full swing with the Union finance ministry organising the traditional Halwa Ceremony today. Every year a Halwa Ceremony is organised at the finance ministry to mark the beginning of printing of documents related to the Union Budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X