ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎవరు..!! ఆమెకు తెలుగురాష్ట్రాలతో ఉన్న బంధం ఏంటీ..?
Recommended Video
న్యూఢిల్లీ : మోడీ 2.0 క్యాబినెట్ తొలి పద్దు సమర్పించబోతోంది. ఎన్నికలకు ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం.. పూర్తిస్థాయి బడ్జెట్ రూపొందించింది. అయితే బడ్జెట్ సమర్పించే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎవరూ అనే చర్చ జరుగుతుంది. ఆమెకు తెలుగురాష్ట్రాలతో ఉన్న బంధం ఎలాంటిది అని ప్రతి నలుగురు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇంతకీ నిర్మలా సీతారామన్ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటీ?

ఎవరీ నిర్మలా ..
నిర్మలా సీతారామన్.. మోడీ 2.0 క్యాబినెట్‌లో ఆర్థికశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఓ మహిళ పూర్తిస్థాయిలో ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఇదివరకు ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టినా .. ఆమె ప్రధాని పదవీతోపాటు విత్త మంత్రి పదవీని అంటిపెట్టుకున్నారు. కానీ నిర్మలా పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు.

వ్యక్తిగత జీవితం ...
నిర్మలా సీతారామన్ స్వస్థలం తమిళనాడు. 1959 ఆగస్టు 18న తిరుచిరాపల్లిలో జన్మించారు. విద్యాభ్యాసం అంతా తిరచిరాపల్లిలోనే జరిగింది. డిగ్రీ సీతాలక్ష్మీ రామస్వామి కాలేజీలో పూర్తిచేశారు. అక్కడినుంచి పై చదవుల కోసం ఢిల్లీ చేరుకున్నారు. జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీ నుంచి ఎంఫిల్ చేశారు. ఇక్కడే ఆమెకు పరకాల ప్రభాకర్ పరిచయమయ్యారు. తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు. అలా తెలుగుంటి కోడలు అయ్యారు నిర్మలా సీతారామన్. పరకాల ప్రభాకర్ న్యూస్ యాంకర్‌గా సుపరిచితులు. అలాగే చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో కీ రోల్ పోషించారు. మొన్నటివరకు ఏపీ సర్కార్‌లో అధికార ప్రతినిధిగా కూడా కొనసాగారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు.

కొలువు .. అటు నుంచే ...
చదువు పూర్తయ్యాక .. ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఆడిటింగ్ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేశారు. తర్వాత ప్రముఖ వార్తా సంస్థ బీబీసీలో పనిచేశారు. 2003 నుంచి 2005 వరకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. నిర్మలా అత్త,మామలు కాంగ్రెస్ పార్టీకి చెందినవారైనా .. ఆమె మాత్రం బీజేపీలో చేరారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్నప్పుడే 33 శాతం మహిళలకు రిజ్వర్వేషన్‌కు బీజేపీ శ్రీకారం చుట్టడంతో ... ఆ పార్టీలో చేరేందుకు దోహదపడింది. తర్వాత బీజేపీ కార్యవర్గంలో చేరాలని ఆహ్వానం రావడంతో జాయిన్ అయ్యారు. 2010లో బీజేపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించి .. అంచెలంచెలుగా ఎదిగారు. 2014 వరకు కూడా స్పోక్స్ పర్సన్‌గా కొనసాగారు. మోడీ తొలి క్యాబినెట్‌లో సహాయ మంత్రి పదవీ నుంచి కీలకమైన రక్షణశాఖ మంత్రి బాధ్యతలు నిర్వహించారు.

డిఫెన్స్ మినిస్టర్‌గా కూడా ...
ఆర్థికమంత్రే కాదు .. తొలి రక్షణశాఖ మహిళ మంత్రిగా కూడా నిర్మలా సీతారామన్ పేరు తెచ్చుకున్నారు. అంతకుముందు ఇందిరాగాంధీ కూడా రక్షణశాఖ బాధ్యతలు నిర్వహించారు. 1980 నుంచి రెండేళ్లపాటు ప్రధానీ పదవీతోపాటు డిఫెన్స్ మినిస్టర్ బాధ్యతలు చూశారు ఇందిరా. కానీ నిర్మలా తొలి మహిళా రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. అంతేకాదు మంచుగడ్డ కట్టే సియాచిన్ ప్రాంతాన్ని పలుమార్లు పరిశీలించి .. తాను ధీరో వనితను రుజువుచేశారు. దీంతోపాటు కశ్మీర్‌లోనూ పర్యటించి .. జవాన్లలో మరింత ధైర్యం నింపారు.












Click it and Unblock the Notifications