Union Budget 2024:ఆ వర్గాలే టార్గెట్‌గా నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్..?

Union Budget 2024:జనవరి 31వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి బడ్జెట్ సాధారణ ఎన్నికలకు ముందు కనుక దీన్ని మధ్యంతర బడ్జెట్‌గా ప్రవేశపెడుతున్నారు. దీన్నే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని కూడా పిలుస్తారు. ఇక ఈ సారి మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్లో వివిధ వర్గాల వారికి తాయిలాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సమాజంలోని ఐదు కీలక వర్గాలను మోదీ సర్కార్ లక్ష్యంగా చేసుకుని తాయిలాలు ప్రకటించే స్కోప్ కనిపిస్తోంది. ఎవరా వర్గాలు.. ఏమా పథకాలు..?

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కనుక అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా బడ్జెట్‌ను ప్రిపేర్ చేస్తున్నారు. ఇక ఐదు వర్గాలను లక్ష్యంగా చేసుకుని బడ్జెట్‌ను తయారు చేస్తున్నట్లు సమాచారం. మహిళలు, బీదబడుగు బలహీన వర్గాలు, యువత, రైతులు, గిరిజనుల పై ఎక్కువగా బడ్జెట్‌లో ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం.ఈ సారి కేంద్రంలో తిరిగి మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ వర్గాలను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Budget 224:Nirmala sitharamans interim budget to target five sections of the society,check here

ఇక ఇప్పటికే పైన పొందుపర్చిన ఐదు వర్గాల వారికి ఇస్తున్న పథకాలలో మరిన్ని మేలు చేసే అంశాలను చేర్చడంతో పాటు.. ఇంకొన్ని కొత్త పథకాలను తీసుకొచ్చేలా మోదీ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.వీరికోసం రూపొందించిన పథకాలు మరింత విస్తరింపచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉదాహరణకు విద్య నైపుణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో వర్తించే పథకాల ద్వారా యువత కలలు, వారి అభివృద్ధికోసం చేయబోయే కార్యక్రమాలను నొక్కి వివరిస్తున్నారు. ఇలానే మిగతా పథకాలపై కూడా ఫోకస్ చేసి మహిళలు, పేదలు, యువత, రైతులు,గిరిజనుల ఓటు బ్యాంకే లక్ష్యంగా బడ్జెట్‌ను ప్రిపేర్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌‌ను ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. 2019లో మోదీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి రావడంతో నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.1970-71వ ఆర్థిక సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఇక ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండవ మహిళా మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు.ఇక నిర్మలమ్మ ఆర్థికశాఖ మంత్రిగా పలు సవాళ్లను ఎదుర్కొంది. ఇందులో ప్రధానంగా కరోనా అతిపెద్ద సమస్యగా ఉండటంతో పాటు పెనుసవాలుగా మారింది.ఆ సమయంలో పేదలకు కావాల్సిన నిత్యావసరాలు, ఇతరత్రా అవసరాలను సమకూర్చడంలో నిర్మలమ్మ సక్సెస్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+