భవనం కూలి నిద్రలోనే 9 మంది మృతి (వీడియో)
థానే: పురాతన కట్టడం కుప్పకూలిపోయి 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. ఈ దుర్ఘటనలో 10 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు.
థానే జిల్లా లోని థాకూర్లి లో మాతృఛాయ పేరుతో రెండు అంతస్తుల కట్టడం ఉంది. మంగళవారం రాత్రి ఒక్క సారిగా ఈ భవనం కూలిపోయింది. సమాచారం తెలుసుకున్న సహాయ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఇప్పటి వరకు 9 మంది మరణించారని పోలీసు అధికారులు తెలిపారు. 30 సంవత్సరాల క్రితం ఈ భవంతిని నిర్మించారని పోలీసులు అన్నారు. 20 కుటుంబాలు ఈ భవనంలో నివాసం ఉంటున్నారని పోలీసులు చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భవనం కూలిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications