హేమామాలినివైపు దూసుకొచ్చిన ఎద్దు: చుట్టూ నిల్చుని..(వీడియో)

Subscribe to Oneindia Telugu

మథుర: భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలు హేమామాలిని మథుర రైల్వే స్టేషన్లో బుధవారం ఆకస్మిక తనిఖీలకు వెళ్లారు. ఈ సమయంలో ఓ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ఓ ఎద్దు ఆకస్మాత్తుగా స్టేషన్లో‌కి దూసుకొచ్చింది. దాన్ని అదుపులో చేయాలని కొంతమంది ప్రయత్నించడంతో అది బెదిరిపోయి పరుగులు తీసి హేమామాలిని సమీపంలోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎద్దును హేమామాలిని వద్దకు రాకుండా ఆమె చుట్టూ నిల్చుని అడ్డుకున్నారు. దీంతో ఆ ఎద్దు పక్కకు వెళ్లిపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఆ తర్వాత రైల్వే స్టేషన్‌లో పశువులు తిరగడంపై హేమామాలిని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యం ఎందుకని నిలదీశారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని హెచ్చరించారు. ప్రయాణికులకు సరైన సౌకర్యాలు అందడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It was literally a case of taking the bull by its horns when BJP MP Hema Malini made a surprise visit to the Mathura Railway Station on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి