జపాన్‌తో స్నేహం తీసుకొస్తున్న బుల్లెట్ రైలు: మోడీ థ్యాంక్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: ప్రతిదేశానికి కలులు ఉండాలని. వాటిని సాకారం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అహ్మదాబాద్‌లో బుల్లెట్‌ రైలు మార్గానికి శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడారు.

శక్తివంత జపాన్.. భారత్‌పై ఆధారపడి ఉంది: షింజో, బుల్లెట్ రైలు పనులకు శంకుస్థాపన

భారత్‌ చిరకాల స్వప్నం పట్టాలు ఎక్కనుందన్నారు. ఈ ప్రాజెక్టు ఉద్యోగాలను, వేగాన్ని, పర్యావరణ పరిరక్షణను, జపాన్‌ మరింత స్నేహాన్ని తీసుకువస్తుందన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలకు ఇది నిదర్శనమన్నారు.

Bullet Train Project Launched, PM Thanks Japan's Abe For 'Gift': 10 Points

ఈ ప్రాజెక్టులో ఎటువంటి ఇబ్బందులు రాకూడదని జపాన్‌ ప్రధాని అబే నిశ్చయించుకున్నారని చెప్పారు. పూర్వం నదుల వద్ద నాగరికత ఉండేదని, తర్వాత రహదారులు ఉన్న చోట ప్రజలు నివసించారన్నారు.

ఇప్పుడు హైస్పీడ్‌ కారిడార్లు ఉన్నచోటే అభివృద్ధి ఉంటోందని మోడీ అన్నారు. రైల్వే లైన్లు వచ్చిన తర్వాతే అమెరికా అభివృద్ధి సాధించిందన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు విషయంలో అవాంతరాలు ఉండవని చెప్పినందుకు జపాన్ ప్రధానికి ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi and his Japanese counterpart Shinzo Abe on Thursday laid the foundation stone of the 508-km long Mumbai-Ahmadabad High-Speed Rail in Ahmadabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X