దేశంలో ఊపందుకున్న 7 కొత్త హై స్పీడ్ రైలు కారిడార్ల పనులు.. బుల్లెట్ రైళ్లు నడిచే రూట్స్ ఇవే!
భారతీయ రైల్వే కొత్త శకానికి నాంది పలకబోతుంది. ఇప్పటికే వందే భారత్ రైళ్లతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకుపోతున్న రైల్వేలు, ఇప్పుడు బుల్లెట్ రైలు మార్గాలతో హై స్పీడ్ రైలు సేవలను అందుబాటులోకి తీసుకు రానున్నాయి. ఇండియన్ రైల్వేస్ ఏడు కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రారంభించనుంది. ఈ మేరకు 2026 కేంద్ర బడ్జెట్లో 7 కొత్త హై స్పీడ్ కారిడార్ల ప్రకటన చేశారు.
దేశంలో ఏడు బుల్లెట్ రైల్ కారిడార్లు
ఈ హై స్పీడ్ రైలు కారిడార్లు లేదా బుల్లెట్ రైలు కారిడార్లు దేశవ్యాప్తంగా నాలుగువేల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంటాయి . ఈ ఏడు హై స్పీడ్ కారిడార్లను పూర్తి చేయడానికి 16లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఢిల్లీ నుండి వారణాసి, ముంబై నుండి పూణే మరియు చెన్నై నుండి బెంగళూరు వరకు కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లు కీలకమైన ఆర్థిక కేంద్రాల అనుసంధానం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

బడ్జెట్ లో ప్రకటించిన ప్రతిపాదిత బుల్లెట్ రైళ్ళు ఇవే
బడ్జెట్లో ప్రకటించిన ఈ ఏడు కొత్త హై స్పీడ్ కారిడార్లు ఎక్కడ ఉన్నాయి? ఈ బుల్లెట్ రైలు నడిచే రూట్లు ఏంటి? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. మెట్రో నగరాల మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టు లో ప్రతిపాదిత రైళ్ల విషయానికి వచ్చినట్లయితే.. ఉత్తర భారతదేశానికి కీలక మార్గమైన ఢిల్లీ వారణాసి హై స్పీడ్ రైలు ఒకటి.
ఈ మార్గాల్లో బుల్లెట్ రైళ్ళు
రెండవది ఉత్తర పశ్చిమ భారత్ లను అనుసంధానం చేసే ఢిల్లీ అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు, దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నుండి మహారాష్ట్రలో ప్రధాన కనెక్టివిటీని పెంచే ముంబై నాగపూర్ హై స్పీడ్ రైలు, వారణాసి సిలిగురి బుల్లెట్ రైలు ఉన్నాయి.
దక్షిణాది మెట్రో నగరాలకు హైస్పీడ్ రైళ్ళు
దక్షిణ, పశ్చిమ నగరాల అనుసంధానం చేసే ముంబై హైదరాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్, దక్షిణ భారతదేశంలో వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే చెన్నై మైసూర్ హైస్పీడ్ రైలు కారిడార్, దేశంలోని పంజాబ్ ప్రాంతానికి త్వరితగతిని చేరుకునే మార్గమైన ఢిల్లీ అమృత్సర్ హై స్పీడ్ రైల్ కారిడార్ లను ఏర్పాటు చేయడానికి సంకల్పించిన కేంద్రం, ఈ ప్రాజెక్టుల పనులను వేగంగా ముందుకు తీసుకు వెళ్లే పనిలో ఉంది.
హైస్పీడ్ రైళ్లతో తగ్గనున్న ప్రయాణ సమయం
ఢిల్లీ వారణాసి హై స్పీడ్ రైల్వే కారిడార్ ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని కేవలం మూడు గంటల యాభై నిమిషాలకు తగ్గిస్తుంది. వారణాసి సిలిగురి బుల్లెట్ ట్రైన్ పాట్నా ద్వారా నడుస్తూ రైలు ప్రయాణ సమయం కేవలం రెండు గంటల 55 నిమిషాలు మాత్రమే ఉంటుంది. చెన్నై బెంగళూరు హై స్పీడ్ రైలు కారిడార్ తో కేవలం ఒక గంట 13 నిమిషాలకు ప్రయాణ సమయం తగ్గుతుంది.
రైలు రవాణాలో హైస్పీడ్ రైళ్ళు మరింత సౌకర్యవంతం
బెంగళూరు హైదరాబాద్ హై స్పీడ్ రైలు కారిడార్ రైలు ప్రయాణ సమయాన్ని రెండు గంటలకు తగ్గిస్తుంది. చెన్నై హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ ప్రయాణ సమయాన్ని దాదాపు రెండు గంటల 55 నిమిషాలకు తగ్గిస్తుంది. ముంబై పూణే బుల్లెట్ కారిడార్ ప్రయాణ సమయాన్ని గంట కంటే తక్కువకు మారుస్తుంది. పూణే హైదరాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ ప్రయాణ సమయాన్ని రెండు గంటల కంటే తక్కువకు తగ్గిస్తుంది. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ రెండు గంటల ఏడు నిమిషాలలో ముంబై అహ్మదాబాద్ ల మధ్య ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది..
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications