ఆత్మహత్య చేసుకుంటా.. పోలీసులనే బెదిరిస్తోన్న ‘బుల్లి బాయ్’ నీరజ్

బుల్లి బాయ్ యాప్ సృష్టికర్త నీరజ్ బైష్ణోయ్ పోలీసు కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతను సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు విచారిస్తోన్న సమయంలో రెండు సార్లు తనకు తన గాయపరచుకున్నారు. తర్వాత పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని తెిలసింది. అయితే ఇదీ విచారణను మరింత ఆలస్యం చేయడానికేనా అనే అనుమానం కలుగుతుంది. అతని ఆరోగ్యం కోసం అన్నీ చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నీరజ్.. ఇదివరకే హ్యాకింగ్ చేశారు. 15 ఏళ్ల నుంచి ఇదే పని చేస్తున్నారు.ఇండియా పాకిస్తాన్ స్కూల్, వర్సిటీ.. ఇతర సైట్లను హ్యక్ చేశాడు

బుల్లి బాయ్ యాప్ సృష్టికర్తను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. బుల్లి బాయ్ యాప్ ద్వారా చాలా మంది ముస్లిం యువతులు, మహిళల ఫొటోలను వారి అనుమతి లేకుండా బుల్లి బాయ్ యాప్‌లో అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో వేలం వేసిన ఆరోపణలు దేశంలో తీవ్ర కలకలం సృష్టించాయి. ఢిల్లీకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు ఈ ఉదంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. జనవరి 1న దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసందే.

 ‘Bulli Bai’ app prime accused Niraj Bishnoi threatens suicide in police custody

అసోంలోని దిగంబర్ జొర్హట్‌కు చెందిన నీరజ్ బిష్ణోయ్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడని పోలీసులు తెలిపారు. భోపాల్‌లోని వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అతను ఇంజనీరింగ్ చదువుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్పును ముమ్మరం చేసిన ఢిల్లీ పోలీసులు అస్సాంలోని జొర్హట్‌లో నీరజ్ ను అరెస్టు చేశారు. ఆయనతోపాటు ఓ డివైజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డివైజ్ ద్వారానే బుల్లి బాయ్ యాప్ డెవలప్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

అరెస్ట్ అనంతరం నిందితుడిని ఢిల్లీకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌ పరిధిలోని ఐఎఫ్ఎస్‌వో బృందం నీరజ్ బిష్ణోను అరెస్టు చేసిందని ఈ బృందం చీఫ్ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు. గిట్ హబ్‌లో బుల్లి యాప్ తయారీదారు ఆయనే అని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన నిందితుడు అతనేనని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+