కేంద్ర మంత్రి గడ్కరీ సోదరి ఇంట్లో దుండగులు

నాగపూర్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోదరి ఇల్లు లూటీ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. సోదరికి ఫోన్ చేసిన గడ్కరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరువాత స్థానిక పోలీసు అధికారులతో గడ్కరీ మాట్లాడారు.

గడ్కరీ సోదరి మనీషా సోలర్ విద్యుత్ కంపెనీ యజమాని కోషర్ టోటల్ ను వివాహం చేసుకున్నారు. వీరు నాగ్ పూర్ లోని పాండా లేఔట్ లో నివాసం ఉంటున్నారు. కోషర్ పని మీద కోల్ కత్తాకు వెళ్లారు. తరువాత నాగ్ పూర్ చేరుకున్న కోషర్ భార్య మనీషాకు ఫోన్ చేసి ఎయిర్ పోర్ట్ దగ్గరకు వచ్చి పిలుచుకుని వెళ్లాలని చెప్పారు.

 Nitin Gadkar

మనీషా ఆమె కుమారుడు కారు తీసుకుని ఎయిర్ పోర్టు దగ్గరకు వెళ్లారు. తరువాత అందరూ ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టిన నిందితులు బీరువాలో ఉన్న వస్తువులు చెల్లాచెదురు చేసి ఒక కేజీ బంగారు నగలు, వెయ్యి డాలర్ల అమెరికా కరెన్సీ, రెండు కేజీల వెండి వస్తువులు లూటీ చేశారని గుర్తించారు.

కోషర్ ఫిర్యాదు చెయ్యడంతో నాగ్ పూర్ ఎస్పీ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రూ. 25 లక్ష్లల విలువైన బంగారు నగలు, అమెరికా కరెన్సీ చోరీ అయ్యిందని ఫిర్యాదు చేశారని కేసు దర్యాప్తులో ఉందని ఎస్పీ యాదవ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+