ఇండియాను తాకిన బుర్ఖాలు, ముసుగుల నిషేధం
శ్రీలంక బాంబు పేలుళ్ల తర్వాత భారత దేశంలోని హిందూ ప్రచార గ్రూపుల్లో కదలిక మొదలైంది. ఈనేపథ్యంలో శ్రీలంకలో విధించినట్టుగానే తీవ్రవాదాన్ని తగ్గించేందుకు గాను ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాల తోపాటు ముఖాన్ని కప్పే వస్త్రాలను పబ్లిక్ ప్రాంతాలు, ప్రభుత్వ మరియు ప్రయివేట్ ఇనిస్టిట్యూట్స్ లలో నిషేధించాలని డిమాండ్ చేస్తూ హిందూసేన అనే గ్రూప్ హోంమంత్రిత్వ శాఖకు లేఖను రాసింది.

ముసుగుల వల్ల తీవ్రవాదులను గుర్తించలేక పోతున్నామని , తీవ్రవాదులు ముసుగు ద్వార గుర్తించకుండా కాపాడుకుంటున్నారని హిందూసేన జాతియ అధ్యక్షుడు విష్ణుగుప్త హోం సెక్రటరీ రాజీవ్ కు ఈ లేఖ రాశారు. కాగా శ్రీలంకలోని గత వారం జరిగిన బాంబు పేలుళ్లలో బాగంగా 250 మంది మృత్యువాత పడడంతో ఎవరు ముసుగులను ధరించకూడదని నిషేధం విధించింది.దీంతో అది రెండు రోజుల నుండి అమలులో కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications