వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోయలోకి దూసుకెళ్లిన బస్సు-32 మంది మృతి-20 మందికి తీవ్ర గాయాలు-మోడీ సంతాపం

|
Google Oneindia TeluguNews

ఉత్తరాఖండ్ లోని కోట్ ద్వార్ లో ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 32 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. కోట్ ద్వార్ జిల్లాలో లోతైన లోయలోకి బస్సు పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీంతో కొందరైనా బతికి బట్టకట్టే అవకాశముంది.

ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్ జిల్లాలో దాదాపు 55 మందితో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల బస్సు 500 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో 32 మంది చనిపోయారు. ఘటనా స్ధలికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. క్షతగాత్రుల్ని స్ధానిక ఆసుపత్రికి తరలించారు. పౌరీ జిల్లాలోని ధూమకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిమ్ది గ్రామ సమీపంలో బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లు గుర్తించారు. ఈ బస్సు హరిద్వార్ జిల్లాలోని లాల్‌ధాంగ్ నుంచి పౌరీ జిల్లా బీర్‌ఖాల్ బ్లాక్‌కు వెళుతోంది. బస్సులో పెళ్లికి ప్రయాణికులు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

బస్సు లోయలో పడినట్లు తెలియగానే ముందుగా దుమ్‌కోట్ పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర విపత్తు నిర్వహణ కేంద్రానికి చేరుకున్నారు.

bus falls into gorge in uttarakhand- 32 dead and 20 severely injured

బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి కార్యాలయం కూడా స్పందించింది. "ఉత్తరాఖండ్‌లోని పౌరీలో జరిగిన బస్సు ప్రమాదం హృదయాన్ని కదిలించింది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. సహాయక చర్యలు ప్రబలుతోంది. బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని ప్రధాని మోదీ తెలిపారు.

English summary
32 travellers dead and nearly 20 injured in a bus accident where it falls into gorge in uttrakhand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X