బెంగళూరులో స్తంభించిన బస్సులు- బోసిపోయిన మెజస్టిక్
కర్ణాటకలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల నిరవధిక సమ్మె ఆరంభమైంది. ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి బస్సులు స్తంభించాయి. రాష్ట్రవ్యాప్తంగా బస్సులేవీ కూడా రోడ్డెక్కలేదు. బెంగళూరు సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో బంద్ ప్రభావం కనిపించింది. ప్రయాణికులు, విద్యార్థులు బస్సుల కోసం పడిగాపులు పడుతున్నారు.
తమ డిమాండ్ల సాధన కోసం కేఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ కొంతకాలంగా పోరాడుతోంది. సోమవారం కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో సమావేశం అయ్యారు. అవి ఫలించలేదు. దీనితో నిరవధిక సమ్మెకు కేఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.

38 నెలలుగా చెల్లించని జీతాల బకాయిలను పరిష్కరించడం, 15 శాతం జీతాల పెంపు వంటి 12 అంశాల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలనేది జేఏసీ డిమాండ్. అందులో కొన్నింటికి మాత్రమే పచ్చజెండా ఊపారు సిద్ధరామయ్య. ఆర్థిక భారం పడని అంశాలను అప్పటికప్పుడు అమలు చేయడానికి అంగీకరించారు. దీనికి జేఏసీ నేతలు అంగీకరించలేదు.
అదే సమయంలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ అడ్వొకేట్ ఎన్ పీ లమృతేష్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనితో హైకోర్టు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుంది. సమ్మెను వాయిదా వేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల ఆధారంగా కేఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అక్రమ్ పాషా.. ఉత్తర్వులు ఇచ్చారు. ఉద్యోగులు కోర్టు ఆదేశాన్ని పాటించాలని, సమ్మెలో పాల్గొనకూడదని అన్నారు.
హైకోర్టు ఉత్తర్వుల్లో ఎటువంటి స్పష్టత లేకపోవడాన్ని జేఏసీ అధినేత అనంత సుబ్బారావు ప్రస్తావించారు. తమకు హైకోర్టు నుంచి ఆర్డర్ అందిందని, ఇందులో విషయాలు అస్పష్టంగా ఉన్నాయని అన్నారు. తాము నిరవధిక సమ్మెను యధాతథంగా ప్రారంభిస్తామని, తమ వాదనలను హైకోర్టు వినిపిస్తామని చెప్పారు. శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తాని, ఎస్మా వంటి ప్రభుత్వ బెదిరింపులకు భయపడవద్దని అనంత సుబ్బారావు సూచించారు.
STORY | Bus services hit as transport workers begin strike across Karnataka, passengers stranded
— Press Trust of India (@PTI_News) August 5, 2025
READ: https://t.co/e572xd4xqp
VIDEO : pic.twitter.com/r2R4c11z0l
కాగా.. ఈ నిరవధిక సమ్మె ప్రభావం.. ప్రజా రవాణా తీవ్రంగా పడింది. ఈ తెల్లవారు జాము నుంచి కర్ణాటక అంతటా బస్సులు రోడ్లపైకి రాలేదు. ఫలితంగా ప్రయాణికులు అవస్తలకు గురి అవుతున్నారు. బెంగళూరు, మైసూరు, హుబ్బళ్లి, మంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కేఎస్ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి.
రాష్ట్రంలోని నాలుగు రోడ్డు రవాణా సంస్థలు KSRTC, BMTC, NWKRTC, KKRTCకి చెందిన బస్సులేవీ కూడా రోడ్డెక్కలేదు. పలుచోట్ల ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడం కనిపించింది. ఆటోలకు డిమాండ్ ఏర్పడింది. దీనితో ప్రైవేట్ ఆపరేటర్లు, ఆటో డ్రైవర్లు అధిక డబ్బులను వసూలు చేస్తోన్నారు.
#WATCH | Hubballi, Karnataka | People face problems as transport workers of all the four road transport corporations in the state (KSRTC, BMTC, NWKRTC and KKRTC) decided to go on a statewide strike from today to press for their various demands. Visuals from Hosur Regional Bus… pic.twitter.com/ExVEn13j79
— ANI (@ANI) August 5, 2025
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications