55 మంది ప్రయాణికులతో శారదా నదిలో బస్సు బోల్తా.. ముగ్గురు స్పాట్‌డెడ్!
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సిద్ధార్థనగర్ జిల్లా బధాని బ్లాక్ మోహన్‌కోలా గ్రామంలో శారదా నదిలోని బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో బస్సులో 55 మంది ప్రయాణం చేస్తున్నారు. వారంతా ఒకే గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఘటనాస్థలంలోనే ముగ్గురు..
సిద్ధార్థనగర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ రాజగణపతి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మోహన్ కోలా గ్రామానికి చెందిన 55 మంది దేవిపటాన్ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా చార్ గహ్వా వంతెనపై ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఘటన జరిగిన వెంటనే సమీప గ్రామాలకు చెందినవారితోపాటు పోలీసు బృందం సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురు ప్రయాణికులు ఘటనా స్థలంలోనే మరణించారు. తీవ్రంగా గాయపడిన 22 మందిని వారిని సమీప ఆసుపత్రికి హుటాహుటిన తరలించి చికిత్స అందిస్తున్నారు.

#WATCH | Uttar Pradesh, Siddharthnagar | District Magistrate Dr Rajaganapathy R says, "Almost 55 people of Mohan Kola village were travelling in a bus that fell into Sharda river. People from the nearby villages and the police team helped in rescue work. Two people have died in… pic.twitter.com/881cbBm5Xt
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 18, 2024
ఒక్కసారిగా నదిలోకి..
దేవి పటాన్ ఆలయం నుండి ముందన్ సంస్కారం తర్వాత వీరంతా తిరుగుప్రయాణం అయ్యారు. ఆ సమయంలో బస్సు చార్ గహ్వా వంతెన వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఒక్కసారిగా నదిలోకి పడిపోవడంతోపాటు బస్సులో ప్రయాణికులు ఎక్కవగా ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని, ముగ్గురు మృతికి కూడా అదే కారణమని ప్రత్యక్షసాక్ష్యులు చెబుతున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ రాజగణపతి వెల్లడించారు.












Click it and Unblock the Notifications