అమ్మాయి నాలుక కోసి, కళ్లు పీకి చంపేశాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

గుర్గావ్: గుర్గావ్‌కు చెందిన ఓ వ్యాపారి ఓ అమ్మాయిని అత్యంత దారుణంగా హత్య చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. మీ కూతురుని నాకు అమ్మేయండి అంటూ ఓ కుటుంబాన్ని దుకాణుదారు చిరాకు పెడుతూ వచ్చాడు. వారు అందుకు నిరాకరించారు. అయినా పట్టువిడవకుండా ప్రలోభాలకు గురి చేస్తూ వచ్చాడు.

చివరకు అతను అమ్మాయి అపహరించి అమానుషమైన రీతిలో హత్య చేశాడు. పాపను చిత్రహింసలు పెట్టి చంపేసినట్లు తెలుస్తోంది. హర్యానాలోని గుర్గావ్‌లో ఈ నెల 10వ తేదీన ఓ నాలుగేళ్ల బాలిక కనిపించుకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్ాదు చేశారు.

పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారికి పాప మృతదేహం కనిపించింది. పాప శరీరంపై తీవ్రమైన గాయాలు కనిపించాయి. చిత్రహింసలకు గురిచేసిన గుర్తులు ఉన్నాయి. దాంతో పాటు పాప నోట్లోని నాలుక, కళ్లు అదృశ్యమయ్యాయి. చేతి నిండా గాజులు తొడిగి ఉన్నాయి. పాపకు అలంకరణ చేసినట్లు అర్థమవుతోంది.

Businessman kills girl in Gurgaon

దాంతో పోలీసులకు కుటుంబ సభ్యులు అసలు విషయం చెప్పారు. తాము ఉంటున్న వీధిలోనే దుకాణం నడిపే ఓ 40 ఏళ్ల వ్యక్తి తమ కూతురిని అమ్మేయిలని ప్రతి రోజు ఒత్తిడి చేశాడని, పాపను ఎత్తుకుపోయి అతనే దారుణానికి పాల్పడి ఉంటాడని వారు చెప్పారు. క్షుద్రపూజల కోసం పాపను బలి ఇచ్చి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు.

క్షుద్రపూజల వాదనను పోలీసులు కొట్టి పారేస్తున్నారు. అయితే అసలు విషయాన్ని రాబట్టడానికి ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl has been killed by a shop owner at Gurgaon in Haryana. Police are investigating the case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి