వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం రాష్ట్రపతి అందంగా ఉన్నారా..?

|
Google Oneindia TeluguNews

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మంత్రి అఖిల్ గిరి- పీకల్లోతు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు సైతం అఖిల్ గిరిపై నిప్పులు చెరుగుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేస్తోన్నారు.

ఏం రాష్ట్రపతి అందంగా ఉన్నారా..?

ఏం రాష్ట్రపతి అందంగా ఉన్నారా..?

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మంత్రి అఖిల్ గిరి- పీకల్లోతు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు సైతం అఖిల్ గిరిపై నిప్పులు చెరుగుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేస్తోన్నారు.

స్పందించిన కేంద్రమంత్రి

దీనికంతటికీ కారణం- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలే. దేశ ప్రథమ మహిళను కించపరిచేలా, ఆమెను అవమానించేలా అఖిల్ గిరి కామెంట్స్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, మంత్రివర్గం నుంచి తొలగించాలని భారతీయ జనత పార్టీ నాయకులు డిమాండ్ చేస్తోన్నారు. ఈ ఉదంతంపై కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా స్పందించారు.

ముర్ముపై

కాగా- దీనికంతటికీ మూల కారకుడైన అఖిల్ గిరి ఓ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి తనను వ్యక్తిగతంగా విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. తాను అందంగా లేనని, చూడ్డానికి అసహ్యంగా కనిపిస్తానంటూ సువేందు అధికారి తనను అవమానించాడని అఖిల్ గిరి అన్నారు. పోనీ సువేందు అధికారి అందంగా ఉన్నాడా? అంటూ ఎదురుదాడి చేశారు. అందాన్ని బట్టి మనిషి ఎలాంటి వాడనేది చెప్పలేమిన వ్యాఖ్యానించారు.

రాష్ట్రపతి పేరు

అక్కడితో ఆగలేదాయన. ఈ కౌంటర్ అటాక్‌లో రాష్ట్రపతి ప్రస్తావనను తీసుకొచ్చారు. రాష్ట్రపతి కుర్చీ అంటే తనకు ఎంతో గౌరవం అని, ఆ స్థానంలో కూర్చున్న ద్రౌపది ముర్మును అందంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తృణమూల్ కాంగ్రెస్‌ చుట్టూ వివాదాలు చెలరేగేలా చేసింది. మంత్రి అఖిల్ గిరిని తక్షణమే బర్తరఫ్ చేయాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తోన్నారు.

వివరణ ఇచ్చినా..

వివరణ ఇచ్చినా..

దీనిపై అఖిల్ గిరి వివరణ ఇచ్చినప్పటికీ ఈ వివాదం మాత్రం సద్దుమణగట్లేదు. తాను రాష్ట్రపతిని ఎంతగానో గౌరవిస్తానని, దీన్ని అడ్డుగా పెట్టుకుని బీజేపీ నాయకులు రాజకీయం చేస్తోన్నారని వ్యాఖ్యానించారు. తన అందం గురించి మాట్లాడిన సువేందు అధికారిని విమర్శించే సమయంలో పోలిక మాత్రమే తీసుకొచ్చానని, ఎవరి పేరును కూడా ప్రస్తావించలేదని అన్నారు. తాను చేసిన ఈ వ్యాఖ్యలు ద్రౌపది ముర్మును బాధపెట్టి ఉంటే క్షమాపణ కోరుతున్నానని స్పష్టం చేశారు. ఆమెను బాధపెట్టాలనేది తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు.

English summary
West Bengal Minister Akhil Giri drew widespread criticism for making controversial remarks on President Droupadi Murmu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X