వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీపావళీకి దేశీయ వస్తువులనే కొనండి.. ప్రధాని మోడీ పిలుపు

|
Google Oneindia TeluguNews

దీపావళీ సంధర్భంగా దేశీయ ఉత్పత్తులను మాత్రమే కొనాలని ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీపావళీ సంధర్భంగా ప్రతి ఒక్కరు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారని, అయితే ఈ దీపావళీకి మన చేనేత కార్మికులు తయారు చేసిన ఖాదీ బట్టలను కొనుగోలు చేయడం ద్వార వారికి చేయూతనిచ్చినట్టు అవుతుందని అన్నారు.ఆదివారం నాడు రేడియో ద్వార మాట్లాడిన మన్‌ కి బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సంధర్బంగా పలు అంశాలను ఆయన ప్రస్తావించారు.

58వ మన్‌కి బాత్ లో మోడీ

58వ మన్‌కి బాత్ లో మోడీ

ప్రతి నెల మన్‌కి బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలకు తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం ప్రసారమైన కార్యక్రమంలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ సంధర్బంగా పలు అంశాలను వివరించారు. దేశంలో ఆర్ధిక మాద్యం ఉన్న నేపథ్యంలో స్వదేశీ వస్తువులను కొని స్థానిక చేనేతకు చేయూత ఇవ్వాలని ఆయన కోరారు. మరోవైపు దేశవ్యాప్తంగా 125 కోట్ల మంది స్వచ్చ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారని. ఈ సంధర్భంగా ప్రతి వ్యక్తి తన గ్రామంతో పాటు, కుటుంబంలో నిర్వహించిన పరిశుభ్రత , గురించి వివరించాలని భావిస్తున్నాడని చెప్పారు.

పండగల సంస్కృతిని కాపాడండి

దీపావళీ పండగ సంధర్బంగా ఇతరులపై ఉదారంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న పండగల్లో ఇతర రాష్ట్రాలు, దేశాల ప్రజలను ఆహ్వాంచాలని చెప్పారు. ముఖ్యంగా దీపావళీ, పోంగల్ ,ఓనం ,హోలీ లాంటీ పండుగలు ప్రాచుర్యం పొందటానికి ఆయా రాష్ట్రాల ప్రజలు ప్రయత్నించాలని ఆయన కోరారు. పండగల్లో ఆయా రాష్ట్రాల పండగలను, సంప్రదాయలపై ఇతర రాష్ట్రాలు, దేశాల ప్రజలు ఎంతో ఆసక్తిని కల్గి ఉంటారని వారికి మన పండగల విశేషాలను చెప్పి, పండగలను ఉత్సవాలుగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.

భారత లక్ష్మిని గౌరవించండి

భారత లక్ష్మిని గౌరవించండి

దేశంలోని మహిళ విజయాలు జరుపుకోవాలని పిఎం మోడీ తన ప్రసంగంలో పిలుపునిచ్చారు. ఈ రోజు, `భారత్ కి లక్ష్మి'ని గౌరవించాలన్న తన విజ్ఞప్తికి తక్షణ స్పందన లభించిందని, అస్సాం రైఫిల్స్‌కు చెందిన మహిళలందరికీ నాయకత్వం వహించిన బస్సు కండక్టర్ కుమార్తె ఖుష్బూ కన్వర్‌తో సహా స్ఫూర్తిదాయకమైన కథలతో సోషల్ మీడియా నిండిపోయిందని అన్నారు. ఇక పండగల సంధర్భంగా టూరిజంపై కూడ దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సంధర్భంగా సర్ధార్ సరోవర్ ప్రాజెక్టుపై నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని సుమారు 26 లక్షల మంది టూరిస్టులు సందర్శించారని తెలిపారు. మరోవైపు సిక్కు మతగురువు అయిన గురు నానక్ దేవ్ ను స్మరించుకున్నారు.

English summary
PM Narendra Modi addressed the nation through ‘Mann Ki Baat’, his monthly radio broadcast, on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X