వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్కే నగర్ ఉప ఎన్నికలు రద్దయ్యే అవకాశం?

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో ఆర్కే నగర్ కు చెందిన జరగనున్న ఉప ఎన్నికలు రద్దయ్యే అవకాశం కన్పిస్తోంది. పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేశారని ఆధారాలతో సహ బయటపడడంతో మరో నాలుగు రోజుల్లో జరగనున్న ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్ రద్దు చేసే అవకాశం ఉందని జాతీయ మీడియా వార్తా కథనాలు ప్రసారం చేస్తున్నాయి.

తమిళనాడు రాష్ట్రంలోని ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు ఈ నెల 12వ, తేదిన జరగనున్నాయి.అయితే ఉప ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున ఓట్లను కొనుగోలు చేసేందుకుగాను ఆధారాలతో సహా బయటపడడడంతో ఈసీ సోమవారం నాడు కీలక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

ఆదాయపు పన్ను శాఖ నుండి వచ్చే నివేదిక ఆధారంగా నియోజకవర్గంలో తమకు పట్టుబడిన నగదు తాయిలాల వివరాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీ, ప్రత్యేక ఎన్నికల అధికారి విక్రమ్ బాద్రాతో పాటు పలువురు అధికారులు ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు.

by polls in Chennai's RK Nagar may not be held after cash for votes Charge

ప్రస్తుతం ఎన్నికల ప్రధాన కమిషనర్ తో సమావేశమయ్యారు. ఈ విషయమై చర్చిస్తున్నారు. ఒక్కో ఓటుకు దాదాపుగా రూ.4 వేలను చెల్లించారని సమాచారం. నగదు బట్వాడాకు తగిన ఆధారాలు లభించడం అమ్మ, పురచ్చితలైవి శిభిరాలు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కడం కూడఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపాయి.

ఈ విషయమై కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి నజీం జైదీ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసిన తరుణంలో రద్దు చేసే విషయంలో ఉత్కంఠ నెలకొంది. మరో పక్క సీఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారులు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఉన్న ఫలంగా డబ్బు పంపిణీ విషయమై దర్యాప్తకు ఆదేశించింది.అయితే ఈ మేరకు జాతీయ మీడియా ఎన్నికల రద్దు విషయమై వార్తలను ప్రసారం చేస్తున్నాయి.

English summary
By elections in Chennai's RK Nagar constituency to be held on April 12 , may be cancelled, said sources in the election commission a day after cash for votes allegations surfaced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X