Bypolls 2023: ఇండియా కూటమికి తొలి పరీక్ష-ఆరు రాష్ట్రాల్లోని 7 సీట్లలో మొదలు..

వచ్చే ఏడాది దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించే లక్ష్యంతో విపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏకమయ్యాయి. మరికొన్ని తటస్ధ విపక్షాలు కలిసి రాకపోయినా దాదాపు 28 పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమికి ఇవాళ తొలి పరీక్ష ఎదురవుతోంది. ఇప్పటివరకూ పాట్నా, బెంగళూరు, ముంబైలో మూడు సమావేశాలు ఏర్పాటు చేసుకుని వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకాల వరకూ వచ్చిన ఇండియా కూటమికి ఇవాళ ఆరు రాష్ట్రాల్లో తొలి పరీక్ష ఎదురైంది.

ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ సీట్లకు ఇవాళ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో జార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బోక్సానగర్ మరియు ధన్‌పూర్, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి అసెంబ్లీ స్ధానాలు ఉన్నాయి. వీటిలో పశ్చిమబెంగాల్, యూపీలో ఇండియా కూటమి పక్షాలకు అసలు పరీక్ష ఎదురుకాబోతోంది. ఇప్పటివరకూ ఐక్యంగా ఉన్నట్లు చెప్పుకుంటున్న ఇండియా కూటమి పార్టీలు ఈ రెండు చోట్ల ఏం చేయబోతున్నాయనేది ఇవాళ తేలిపోనుంది.

Bypolls 2023:

ఈ 7 సీట్లకు ఇవాళ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల్లో గెలుపు అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమికి కీలకంగా మారడంతో ప్రతీ పార్టీ కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే మొత్తం ఏడు సీట్లలో ఇండియా కూటమి పార్టీలకూ, ఎన్డీయే కూటమి పార్టీలకూ మధ్య ముఖాముఖీ పోరు సాగుతుండగా.. యూపీ, బెంగాల్లోని రెండు సీట్లలో పోరు మరింత ఆసక్తికరంగా మారింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని ఘోసి స్ధానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఇండియా కూటమి పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ పోటీ చేస్తుండగా.. బీజేపీ తరఫున ఎస్పీ నుంచి ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యే దారాసింగ్ చౌహాన్ బరిలో నిలిచారు. అయితే కాంగ్రెస్, బీఎస్పీలు అభ్యర్ధుల్ని పోటీలో పెట్టలేదు. దీంతో వీరి ఓటు బ్యాంకు ఓటువైపు మొగ్గుతుందన్నది కీలకంగా మారింది. అదే సమయంలో ఓబీసీలు ఎక్కువగా ఉన్న ఈ సీటులో జరుగుతున్న ద్విముఖ పోరులో ఇండియాకూటమి పార్టీ అయిన ఎస్పీకి కాంగ్రెస్ లభించే సహకారం యూపీలో భవిష్యత్ సమీకరణాల్ని నిర్ణయించబోతోంది.

Bypolls 2023:

అలాగే పశ్చిమబెంగాల్ లోని ధూప్ గురి స్ధానంలోనూ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల మధ్య ఉపఎన్నికల పోరు జరుగుతోంది. అయితే ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నుంచి ఇక్కడ తృణమూల్ అభ్యర్ధికి మద్దతు లభించాల్సి ఉంది. ఈ విషయంలో లెఫ్ట్, కాంగ్రెస్ ఏంతమేరకు తమ ఓట్లు వేయిస్తాన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇలా యూపీ, బెంగాల్లో జరుగుతున్న ఉపఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఇండియా కూటమి బీటలు వారడం ఖాయం. దీంతో అందరి దృష్టీ ఈ ఉపఎన్నికలపై నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+