టిపై కేబినెట్ నోట్ డ్రాఫ్ట్ రెడీ: షిండే, హైదరాబాద్ సస్పెన్స్

ఓ వైపు సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు విభజనపై నిర్ణయం ముందుకు వెళ్లదని చెబుతున్నప్పటికీ షిండే మాత్రం నోట్ తమ వద్దకు వచ్చిందని, దానిని పరిశీలిస్తామని చెప్పడం గమనార్హం. ఈ నెలాఖరులోగా కేబినెట్ నోట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు హైదరాబాదులో తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెసు నేతలు భేటీ అయ్యారు. భేటీ అనంతరం మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడారు. సీమాంధ్రలో ఒక నేతలు చెబితే ఉద్యమం జరగడం లేదని తాము తెలంగాణ ప్రాంత నేతలకు చెప్పామన్నారు. అక్కడి ఉద్యమంపై వారికి వివరించామన్నారు. అందుకు వారు తమ అభ్యంతరాలు చెప్పమన్నారని, తాము మాత్రం సమైక్యం తప్ప మరొక పరిష్కారం లేదని చెప్పామన్నారు.
సుశీల్ కుమార్ షిండే కేబినెట్ నోట్ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిందేనని చెప్పారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ... విభజన జరిగితే సీమ ప్రాంతానికి నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. కలిసుండి నష్టాలను పరిష్కరించుకుందామని తాము వారికి సూచించామన్నారు. గతంలో జరిగిన నష్టాలను పరిష్కరించుకుందామని తెలంగాణ నేతలకు తాము చెప్పామన్నారు.












Click it and Unblock the Notifications