వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీరుకు చుక్కలు: శశికళతో 17మంది మంత్రులు, సీఎం దిశగా..

తమిళనాడులో.. ముఖ్యంగా అన్నాడీఎంకేలో రాజకీయాలు రంజుగా మారాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన శశికళ.. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం దిశగా పావులు కదుపుతున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో.. ముఖ్యంగా అన్నాడీఎంకేలో రాజకీయాలు రంజుగా మారాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన శశికళ.. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం దిశగా పావులు కదుపుతున్నారు.

'చిన్నమ్మ'కు జవాబు రాజీవ్ గాంధీ!: శశికళ మరో సోనియా... కాదా?'చిన్నమ్మ'కు జవాబు రాజీవ్ గాంధీ!: శశికళ మరో సోనియా... కాదా?

ఇప్పటికే పలువురు మంత్రులు, నేతలు ఆమెను సీఎంగా చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇదంతా శశికళ వ్యూహంలో భాగమేననే వాదనలు వినిపిస్తున్నాయి. పన్నీరు సెల్వంను తొలగించి, ఆయన స్థానంలో పీఠం ఎక్కేందుకు శశికళ ముమ్మర ప్రయత్నాలు చేశారంటున్నారు.

sasikala

చిన్నమ్మతో మంత్రుల భేటీ

సోమవారం సాయంత్రం పోయెస్ గార్డెన్‌లో పలువురు మంత్రులు అత్యవసరంగా సమావేశమయ్యారు. దాదాపు పదిహేడు మంది మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పన్నీరుకు వ్యతిరేకంగా శశికళ పావులు కదుపుతున్నారని అంటున్నారు.

జయలలిత చేపట్టిన అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకు పోవడానికి చిన్నమ్మనే సరైన వ్యక్తి అని, ఆమె సీఎం పదవి చేపట్టాలని అన్నాడీఎంకే నేతలు కోరుతున్నారు. లోకసభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై పార్టీ తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు. శశికళ సీఎం కావాలని అందులో పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం మంత్రులు పోయెస్ గార్డెన్ వచ్చి చిన్నమ్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పటికే ఐదుగురు మంత్రులు శశికళ సీఎం కావాలని ప్రకటించారు. ఇప్పుడు పదిహేడు మంది మంత్రులు చిన్నమ్మను కలవడం.. పన్నీరు సెల్వంకు ఇబ్బందికర పరిణామమే.

'అమ్మపై పథకం ప్రకారం.. శశికళ నిజస్వరూపం బయటపడింది''అమ్మపై పథకం ప్రకారం.. శశికళ నిజస్వరూపం బయటపడింది'

శశికళను కలిసిన పన్నీరు సెల్వం

పోయెస్ గార్డెన్‌లు శశికళను ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా కలిశారు. కాగా, ఆయన ముఖ్యమంత్రి పదవి వదులుకునేందుకు ససేమీరా అంటున్నట్లుగా తెలుస్తోందని అంటున్నారు. శశికళకు పార్టీ చీఫ్ పదవికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు. తాను కూర్చున్న పీఠాన్ని ఆమెకు ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా లేరంటున్నారు.

కాగా, పార్టీ చీఫ్ పదవికి శశికళ అర్హురాలు కాదంటూ ఆ పార్టీ బహిష్కృత నేత శశికళ పుష్ప దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే.

శశికళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ అన్నాడీఎంకే ప్రిసైడింగ్‌ ఛైర్మన్‌ మధుసూదన్‌ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు, శశికళ పుష్ప పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చాయి. ఈ మేరకు జస్టిస్‌ కల్యాణ సుందరం నేతృత్వంలోని ధర్మాసనం పైవిధంగా తీర్పు వెలువరించింది.

శశికళకు ఊరట: మీకు హక్కు లేదు.. పుష్పకు షాకిచ్చిన హైకోర్టుశశికళకు ఊరట: మీకు హక్కు లేదు.. పుష్పకు షాకిచ్చిన హైకోర్టు

పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయాలంటే కనీసం అయిదేళ్ల పాటు పార్టీ సభ్యులుగా ఉండాలని, శశికళ పార్టీ సభ్యురాలు కాదని శశికళ పుష్ప వాదించారు. అందువల్ల పార్టీ ఉన్నత పదవికి ఆమె అర్హురాలు కాదంటూ భర్త లింగేశ్వర తిలగన్‌తో కలిసి మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనికి ప్రతిగా పార్టీ ప్రిసైడింగ్‌ ఛైర్మన్‌ మధుసూదన్‌ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. పార్టీ సభ్యురాలు కాని పుష్పకు పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదని, ఆమె పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ ఆయన మరో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన అనంతరం న్యాయస్థానం శశికళ పుష్ప పిటిషన్‌ను కొట్టివేసింది. డిసెంబర్‌ 31న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

English summary
Call For 'Chinnamma' Sasikala Natarajan As Chief Minister Begins In Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X