• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నాన్నకు ప్రేమతో:మిమ్మలను ఒక్కసారి నాన్నా అని పిలవొచ్చా ..స్టాలిన్ చివరి లేఖ

|
  కరుణానిధికి స్టాలిన్ రాసిన చివరి లేఖలో ఏమన్నారో తెలుసా??

  ఓ రాజ్యానికి రాజు కావొచ్చు కానీ తల్లికి తండ్రికి బిడ్డ ఎప్పుడూ బిడ్డనే... తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ సూరీడు ముత్తువేల్ కరుణానిధి అస్తమించాడు. అయితేనేమి తన సిద్ధాంతాలను తన వారసత్వాన్ని తమిళ ప్రజల గొంతును వినిపించాల్సిందిగా తన రెండో కుమారుడు రాజకీయ వారసుడు అయిన స్టాలిన్‌కు బాధ్యతలు అప్పజెప్పి శాశ్వతంగా నిద్రపోయారు. కరుణానిధికి ఉన్న కుమారుల్లోకెల్లా ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగింది మాత్రం స్టాలినే అని చెప్పక తప్పదు. తండ్రి పట్ల అంతే గౌరవంతో స్టాలిన్ మెలిగారు.

  తండ్రి మాట జవదాటని బిడ్డడుగా స్టాలిన్ మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే తండ్రి మరణంతో స్టాలిన్ పెద్ద అండను కోల్పోయాడు. బాధను దిగమింగుతూ మిగతా కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపుతున్నాడు. కరుణానిధికి ఉన్న అఖండ అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తలైవా అంత కాపోయినా... తాను అండగా ఉంటానని భరోసా ఇస్తున్నాడు.

  Can I call you Appa one last time my leaderStalin writes last letter to dad Karunanidhi

  ఇక తండ్రితో తను గడిపిన మధుర క్షణాలను, రాజకీయ ఆటుపోట్లను, మననం చేసుకుంటున్నాడు స్టాలిన్. తండ్రికి చివరిసారిగా లేఖ రాశాడు. ఆ లేఖ చదివితే ఎవరికైనా సరే కన్నీళ్లు ఆగవు. ఇదే ఆ లేఖ సారాంశం

  " మిమ్మలను నాన్నా...నాన్నా.. అని పిలువడంకంటే తలైవా (నా నాయకుడు)అనే ఎక్కువగా పిలిచాను...

  ఒకే ఒక్క సారి నిన్ను నాన్నా అని పిలువనా....

  ప్రతి సారీ బయటకు వెళ్లేటప్పుడు ఫలానా చోటికి వెళుతున్నానని చెప్పే నీవు...

  ఈసారి ఎక్కడికి వెళుతున్నావో ఎందుకు చెప్పలేదు..?

  నీ మరణాంతరం నీ సమాధిపై ఈ మాటలు ఉండాలని 33 ఏళ్ల క్రితమే మీరు చెప్పారు...

  'జీవితాంతం విశ్రాంతి లేకుండా పనిచేసిన వ్యక్తి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు ..'

  ఇక తమిళులకు చేయాల్సిందంతా చేశానని భావించి ఆ తృప్తితో వెళ్లిపోయావా" అంటూ స్టాలిన్ తన చివరి లేఖను తండ్రికి రాశారు.

  ఇక తమిళ భాషను, తమిళ జాతిని ఎంతగానో ప్రేమించే కరుణానిధి అక్కడి ప్రజలను తమిళంలోనే మాట్లాడాలని తరుచూ చెప్పేవాడు. ఒకసారి డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతూ తమిళులు తమ పిల్లలకు తమిళ పేర్లే పెట్టాలని చెప్పాడు. అయితే తనకు మాత్రం స్టాలిన్ అనే పేరు ఎలా వచ్చిందో అక్కడి ప్రజలకు వివరించాడు. తనపేరు ముందుగా అయ్యాదురై పెట్టాలని కరుణానిధి భావించారని అయితే చివరి నిమిషంలో తన పేరును స్టాలిన్‌గా ఎందుకు మార్చాడో ఆయన చెప్పారు.

  ద్రవిడ ఉద్యమ నేత పెరియార్‌ను కరుణానిధి అయ్యా అని పిలిచేవాడట. ఇక డీఎంకే వ్యవస్థాపకులు కరుణానిధి రాజకీయ గురువు అన్నాదురైలోని దురై పేరును తీసి స్టాలిన్‌కు అయ్యాదురై అని పెట్టాలని భావించడట. అయితే స్టాలిన్ 1953 మార్చిలో జన్మించిన సమయంలో కరుణానిధి రష్యా కమ్యూనిస్ట్ నేత జోసెఫ్ స్టాలిన్ సంతాప సభలో ప్రసంగిస్తున్నారట. ఆ సమయంలో వేదికపై ఉన్న కరుణానిధికి ఈ విషయం తెలిసింది. తన ప్రసంగంలో తన కుమారుడికి స్టాలిన్ అని నామకరణం చేస్తున్నట్లు ప్రకటించాడు. అలా స్టాలిన్‌కు తమిళ పేరు కాకుండా రష్యా కమ్యూనిస్టు స్టాలిన్ పేరు పెట్టడం జరిగింది. ఇక కరుణానిధి మిగతా పిల్లలకు మాత్రం తమిళ పేర్లే పెట్టారు.

  తండ్రి చాటు బిడ్డగా స్టాలిన్ ఎదిగాడు. తండ్రి నుంచే రాజకీయల్లో ఓనమాలు దిద్దాడు. కరుణానిధిలోని ఉద్యమ స్ఫూర్తిని వారసత్వంగా పొందాడు. ఇక డీఎంకే పగ్గాలు చేపట్టేందుకు సిద్దమవుతున్నాడు. అయితే అళగిరి నుంచి ఎలాంటి ఆటంకాలు ఏర్పడకపోతే... ఇది సాధ్యమవుతుంది. లేదంటే పరిస్థితి ఎంతవరకు వెళుతుందో వేచిచూడాలి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  “Can I call you Appa one last time my leader,” DMK leader MK Stalin penned an emotional letter to his departed father and party leader M Karunanidhi on Wednesday.Five-time chief minister and leader of DMK party for 50 years, the 94-year-old Karunanidhi breathed his last in Chennai owing to age-related ailments in a private hospital.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more