కొత్త ఉత్సాహం: సోనియాతో ఖుష్బూ క్లిక్ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరడం తమిళనాడులో ఆ పార్టీ క్యాడర్‌కు కొత్త ఉత్సాహం ఇచ్చింది. ఇటీవలి వరకు డీఎంకేలో ఆమె ముఖ్య నేతగా ఉన్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోను నిరూపించుకున్న ఖుష్బూ చేరిక 'చేతి'కి కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ భావిస్తోంది.
బుధవారం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన ఖుష్బూ, అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరుతున్నారని విలేకరులు ప్రశ్నిస్తే.. ఇప్పుడు ఎందుకు చేరకూడదని ఆమె మీడియాను ఎదురు ప్రశ్నించారు.
సోనియా సమక్షంలో తాను పార్టీలో చేరానని ఆమె తెలిపారు. తమిళనాట కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్నారు. ఇప్పుడు తనకు తన సొంతింటికి వచ్చిన భావన కలుగుతోందన్నారు. అదే సమయంలో డీఎంకే పార్టీ పైన నిప్పులు చెరిగారు. తనకు ఆ పార్టీ తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు. తమ కుటుంబ సభ్యులు మొదటి నుండి కాంగ్రెస్ అభిమానులే అన్నారు.

ఖుష్బూ
ప్రముఖ సినీ నటి ఖుష్బూ బుధవారం నాడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

విలేకరులతో ఖుష్బూ
బుధవారం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన ఖుష్బూ, అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.

ఖుష్బూ
ప్రముఖ సినీ నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరడం తమిళనాడులో ఆ పార్టీ క్యాడర్‌కు కొత్త ఉత్సాహం ఇచ్చింది. ఇటీవలి వరకు డీఎంకేలో ఆమె ముఖ్య నేతగా ఉన్నారు.

ఖుష్బూ
సినిమాలతో పాటు రాజకీయాల్లోను నిరూపించుకున్న ఖుష్బూ చేరిక 'చేతి'కి కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ భావిస్తోంది. కాగా, తాను బీజేపీలో చేరుతున్నట్లుగా వచ్చిన వార్తల పైన ఆమె అంతకుముందు మండిపడ్డారు.
-
విజయ్ ను గెలిపిస్తున్న అన్నామలై?.. లోగుట్టు బయటపెట్టిన సర్వే -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications