"పెద్ద నోట్ల రద్దుతో.. ఆ రెండు రాష్ట్రాలకే లాభం"
లక్నో : వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా నల్లధనం రద్దు కోసమే గనుక అయితే.. రెండేళ్ల క్రితమే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేదని మోడీని ప్రశ్నించారు.

కేవలం కేంద్రం తమ అసమర్థతను, అత్యవసర పరిస్థితిని కప్పి పుచ్చుకునేందుకే.. ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని మండిపడ్డారు. ప్రధాని మోడీ తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే పాత నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని, దీనివల్ల ఎక్కువగా లాభపడేది మహారాష్ట్ర, గుజరాత్ లేనని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే.. మోడీ తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయం వచ్చే ఏడాది జరగబోయే యూపీ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications