వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివక్ష చూపలేం: నిర్భయ దోషుల మరణశిక్షపై స్టే ఇచ్చిన న్యాయమూర్తి ఏం చెప్పారంటే?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Nirbhaya Case : నిర్భయ దోషుల ఉరితీత ఎందుకు వాయిదా పడుతోంది ? || Oneindia Telugu

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషుల ఉరిశిక్షపై స్టే విధిస్తూ ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై నిర్భయ తల్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కూతురుపై దారుణం జరిగి ఏడేళ్లు గడుస్తున్నా.. న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కారు కూడా తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.

నిర్భయ దోషులకు ఉరి వాయిదా: కేంద్రం అసంతృప్తి, 'చట్టంలో లొసుగులతో అపహాస్యం..’నిర్భయ దోషులకు ఉరి వాయిదా: కేంద్రం అసంతృప్తి, 'చట్టంలో లొసుగులతో అపహాస్యం..’

వివక్షచూపకూడదనే..

వివక్షచూపకూడదనే..

కాగా, నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధించిన సందర్భంగా ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు స్పందిస్తూ.. ఒకే కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషుల పట్ల వివక్ష చూపకూడదనే ఉద్దేశంతోనే ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేసింది. ఈ కారణంగానే నిర్భయ కేసులో దోషులైన ముకేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, పవన్ గుప్తాలకు ఉరిశిక్షపై స్టే విధించినట్లు తెలిపింది. ఈ మేరకు 10 పేజీలతో కూడిన ఆర్డర్ జారీ చేసింది.

ఒక్కడినే ఎలా ఉరితీయాలి?

ఒక్కడినే ఎలా ఉరితీయాలి?


‘నిర్భయ కేసులో శిక్ష నుంచి తప్పించుకునేందుకు ముకేష్ సింగ్‌(క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష లాంటి మిగితా అవకాశాలన్నీ తిరస్కరణకు గురయ్యాయి)కు చట్టపరంగా అన్ని దారులు మూసుకుపోయాయి. అయితే, మిగితా ముగ్గురికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. మనదేశంలోని న్యాయస్థానాలు దోషుల పట్ల ఎలాంటి వివక్ష కలిగి ఉండవు. మరణశిక్ష కూడా ఇందుకు మినహాయింపు కాదు. కాబట్టి ముకేష్ ఒక్కడినే ఉరితీయడం సాధ్యం కాదు' అని నిర్భయ దోషలు మరణశిక్షపై స్టే ఇచ్చిన సందర్భంగా జడ్జీ ధర్మేంద్ర రానా పేర్కొన్నారు.

అదే హాల్‌మార్క్ వంటిది..

అదే హాల్‌మార్క్ వంటిది..


జైలు మాన్యువల్‌లోని రూల్ 836 ప్రకారం.. ఒకే కేసులో ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులు దోషులుగా తేలినప్పుడు, ముఖ్యంగా మరణశిక్ష ఎదుర్కొంటున్నప్పుడు ఒక దోషి లేదా
ఆ కేసులో మిగిలిన దోషులంతా నేరుగా గానీ.. వారి తరపున మరెవరైనా గానీ పిటిషన్ దాఖలు చేసినట్లయితే.. ఉరిశిక్షను వాయిదా వేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అయితే, దోషులు శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారన్న ఆరోపణలు పక్కనపెడితే.. దోషులకు చట్టపరంగా ఉన్న అవకాశాలను అన్నింటినీ కల్పించడం నాగరిక సమాజాకి హాల్‌మార్క్ వంటిదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

English summary
‘Can’t discriminate’: Delhi court stays execution of Nirbhaya case convicts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X