Health News: ఆహారం తీసుకునే ముందు నీరు తాగొచ్చా..?
మనం ఏ డాక్టర్ వద్దకు వెళ్లినా నీరు బాగా తాగాలని చెబుతారు. ఎందుకంటే మనం ఎంత నీరు తాగితే అంత మంచి. అలా అని తినకుండా రోజంతా నీరు తాగొద్దు. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఆహారం తీసుకునే ముందు నీరు తాగొచ్చా, లేక హారం తీసుకునేటప్పుడు నీరు తాగొచ్చా లేక తిన్న తర్వాత నీరు తాగొచ్చా.. ఇలా చాలా సందేహాలు ఉన్నాయి.
నిపుణుల సూచన ప్రకారం భోజనం చేసిన వెంటనే నీళ్లు తీసుకోకూడదట. తిన్న వెంటనే నీరు తీసుకుంటే నీరు జీర్ణక్రియ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుందని, ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుందని వారు వివరిస్తున్నారు. అందుకే తినే ముందు, తిన్న తర్వాత కొంత సేపటి తర్వాత నీళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే తినటప్పుడు అవసరమైతే తప్ప నీరు తాగకూడదట.

మనం శాకహారం, నూనె ఆహారం తీసుకుంటే జీర్ణం కావడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుందట. అదే నూనె ఉన్న శాకహారం తీసుంటే జీర్ణం అవ్వడానికి 4 గంటల సమయం పడుతుంది. మాంసహారం అయితే
జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందట. తినడానికి ముందు నీటిని తీసుకుంటే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఆహారం తీసుకున్నవెంటనే నీటిని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ జ్యూస్ తగ్గుతుందని వివరిస్తున్నారు. జీర్ణాశయంలో విడుదలయ్యే ఎంజైమ్‌లు తగ్గుతాయని పేర్కొన్నారు. అన్నం తినే అరగంట ముంది, అన్న తిన్న అరగంట తర్వాతే మాత్రమే నీరు తీసుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications