షాక్:రూ.15 లక్షల డిపాజిట్లుంటే ఇక అంతే, సిట్ సిఫారసుల దిశగా 'మోడీ' అడుగులు

దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందకుగాను ' సిట్ ' చేసిన సూచనలను కేంద్రం అమలు చేసే దిశగా ప్రయత్నిస్తోంది.నగదు నిల్వలపై పరిమితులు విధించాలని కేంద్రం యోచిస్తోంది.ఈ మేరకు సిట్ సూచనలను అమలు చేస్తే ఎలా ఉంటు

ముంబై:పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత నల్లధనాన్ని నిర్మూలించేందుకుగాను ప్రధానమంత్రి నరేంద్రమోడీ గత ఏడాది జూలై మాసంలో 'సిట్ ' చేసిన కీలక సూచనను అమలు చేసేందుకుగాను మోడీ కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు నివేదికలు తెలుపుతున్నాయి.

దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకుగాను మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.ఈ మేరకు మోడీ గత ఏడాది నవంబర్ మాసంలో పెద్ద నగదు నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత రద్దు చేసిన నగదును బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసిన సమాచారాన్ని కూడ ఆదాయపు పన్నుశాఖాధికారులు సేకరిస్తున్నారు.

పెద్ద నగదు నోట్ల రద్దుకు ముందు, ఆ తర్వాత ఆయా బ్యాంకు ఖాతాల్లోని నగదు డిపాజిట్లను కూడ ఆదాయపు పన్నుశాఖాధికారులు పరిశీలిస్తున్నారు.ఈ మేరకు ప్రత్యేకంగా ఎనలిస్టులను ఏర్పాటు చేశారు.

మార్చి నెలాఖరు నాటికి నల్లధనం నిర్మూలన దిశగా కేంద్రం చర్యలు తీసుకొంటుంది.ఈ మేరకుఆదాయపు పన్నుశాఖ అన్ని రకాల చర్యలను తీసుకొంటుంది.నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం.

రూ.15 లక్షల నగదు డిపాజిట్లపై కొరడా

రూ.15 లక్షల నగదు డిపాజిట్లపై కొరడా

సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన' సిట్ 'పలు కీలకమైన సిఫారసులను చేసింది. ఈ సిఫారసులను అమలు చేయాలనే యోచనలో కేంద్రం ఉంది. దీని ప్రకారంగా రూ.15 లక్షలకు పైగా మించిన నగదు నిల్వలపై కొరడా ఝుళిపించే అవకాశం ఉంది.రూ.3 లక్షలక మించిన అన్ని నగదు లావాదేవీలను నిషేధించిన కేంద్రం తాజాగా ఒక వ్యక్తి లేదా సంస్థల క్యాష్ హైల్డింగ్స్ పై కూడ పరిమితులు విధించనుంది. నల్ల ధనంపై యుద్దంలో భాగంగా జిఎస్ టి అమలుతో పాటు మరో సంచలనానికి కేంద్రం తెరతీసే అవకాశం ఉంది.

'. సిట్ ' ఏం సిఫారసు చేసిందంటే

'. సిట్ ' ఏం సిఫారసు చేసిందంటే

దేశంలో నల్లధనం నిర్మూలన జరగాలంటే సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎంబి షా నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. సిట్ పలు సూచనలను చేసింది. రూ.3 లక్షలకు మించిన అన్ని నగదు లావాదేవీల రద్దుతో పాటు, రూ.15 లక్షలకు మించిన నగదును నిల్వ చేసుకోకుండా ఆంక్షలు విధించాలని సూచించింది. నగదు నిల్వలపై కూడ పరిమితులు లేకుండా నిషేధం విధించాలని కోరింది.

నగదు నిల్వలపై పరిమితులు కష్టమే

నగదు నిల్వలపై పరిమితులు కష్టమే

నగదు నిల్వలపై పరిమితులు లేకుండా నిషేధం విధించడం కష్టమేనని సిట్ అభిప్రాయపడింది. అయితే ఏ వ్యక్తి లేదా సంస్థ రూ.15 లక్షలకు మించి నగదు ఉంచుకోకుండా పరిమితిని విధించాలని సిట్ సూచించింది. అయితే మరింత నగదును అవసరమైన సందర్భంంలో సంస్థలు, లేదా వ్యక్తులు తమ ప్రాంతంలోని ఆదాయపుపన్నుశాఖాధికారుల అనుమతిని తీసుకోవాలని సూచించింది.

కేంద్ర మంత్రి నోట ఆర్థిక బిల్లు మాట

కేంద్ర మంత్రి నోట ఆర్థిక బిల్లు మాట

బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. నగదు నిల్వ పరిమితిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.అయితే దీని కోసం ప్రత్యేకమైన ఆర్థిక బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఉందని అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ ప్రకటనతో కేంద్రం ఈ ధిశగా అడుగులు వేస్తోందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+