కిడ్నాప్: మత్తుమందిచ్చి యువతిపై గ్యాంగ్‌రేప్
రేవారి: హర్యానాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 20ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతి పొరుగు జిల్లా మహేందర్‌ఘర్‌లోని కనినా పట్టణంలో కోచింగ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా దుండుగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 13న బాధిత యువతి తన క్లాసులను ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా.. కారులో వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.
అక్కడే ఆమెకు బలవంతంగా మత్తు పదార్థం ఇచ్చి.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహ కోల్పోయిన యువతిని అక్కడే వదిలేసిన నిందితులు పరారయ్యారు.

ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు.. ప్రభుత్వాసుపత్రికి చేరుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. నిందితులలో అజిత్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నాడని బాధితురాలు తెలిపింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు అజిత్ యాదవ్, మరో ఇద్దరు నిందితులపై కేసులు నమోదు చేశారు. బాధితురాలి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోందని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications