వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాంపూల్లో క్యాన్సర్‌ కారకాలు.. 30కి పైగా బ్రాండ్లను రీకాల్ చేసిన అమెరికా కంపెనీ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
షాంపు

ఇళ్లలో వాడుకునే షాంపూలు, డియోడరెంట్లు వంటి ఉత్పత్తుల దిగ్గజ కంపెనీ 'ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్' తమ ఉత్పత్తులైన ప్యాంటీన్ షాంపూలను స్వచ్ఛందంగా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది.

అధిక మోతాదులో బెంజీన్ ఉన్న కారణంగా ప్యాంటీన్‌తో పాటు హెర్బల్ ఎసెన్సెస్, ఓల్డ్ స్పైస్ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తుల్ని ఉపసంహరించుకున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

అధిక మోతాదులో బెంజీన్‌ను ఉపయోగిస్తే, అది క్యాన్సర్ వ్యాధికి దారి తీయవచ్చు.

అమెరికాలో తయారైన మొత్తం 32 ఉత్పత్తులను కంపెనీ వెనక్కి తీసుకుంది. ఈ ఉత్పత్తులను ప్రధానంగా ఉత్తర అమెరికాలో విక్రయించారు. వీటిలో ఆసీ, వాటర్‌లెస్, హెయిర్ ఫుడ్ తదితరాలు ఉన్నాయి.

బెంజీన్ సాధారణంగా మోటారు ఇంధనాలలో లభిస్తుంది. రెజిన్, ప్లాస్టిక్ తయారు చేయడానికి కొన్ని పరిశ్రమలు బెంజీన్‌ను ఉపయోగిస్తాయి.

ఒక వ్యక్తి అధిక స్థాయి బెంజీన్‌ను ఉపయోగించినప్పుడు వారిలో లుకేమియా వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

తమ ఉత్పత్తుల్లో బెంజీన్ అనేది క్రియాశీల పదార్థం కాదని ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ సంస్థ పేర్కొంది. యూఎస్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకారం తమ ఉత్పత్తుల్లో గుర్తించిన బెంజీన్ స్థాయిలు, ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను కలిగించవని స్పష్టం చేసింది.

''వెనక్కి తీసుకుంటోన్న ఉత్పత్తుల్ని రోజూవారీగా వినియోగించినా ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపవు. వాటిలో, ఆ స్థాయిలో బెంజీన్ లేదు'' అని సంస్థ ప్రకటనలో తెలిపింది.

షాంపు

''మేం తయారు చేసే ఏ ఉత్పత్తుల్లో కూడా బెంజీన్ రసాయనాన్ని వినియోగించం. కానీ, డబ్బాలపై స్ప్రే చేసే రంగుల ద్వారా ఊహించని స్థాయిలో బెంజీన్ వస్తున్నట్లు మా సమీక్షలో తెలిసింది'' అని ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ చెప్పుకొచ్చింది.

దీని గురించి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌ను మాట్లాడాల్సిందిగా కోరగా వారు దీనిపై స్పందించలేదు.

శుక్రవారం దీని గురించి ప్రకటన చేయగానే కంపెనీ షేర్లు 1.1 శాతం పడిపోయాయి. కానీ సోమవారం, మంగళవారం ట్రేడింగ్‌లో నష్టాలు భర్తీ అయ్యాయి.

ఈ ఏడాది ప్రారంభంలో, కొన్ని శాంపుళ్లలో బెంజీన్ నమూనాలు గుర్తించినట్లు కంపెనీ చెప్పడంతో జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన సన్‌స్క్రీన్ ఉత్పత్తులను యూఎస్ డ్రగ్ స్టోర్స్ వెనక్కి పంపాయి.

ప్రోక్టర్ అండ్ గాంబల్

బెంజీన్ ఎక్కడ ఉంటుంది? దానివల్ల కలిగే లక్షణాలు ఏంటి?

ప్రతిరోజూ సాధారణంగా తిరిగే ప్రాంతాల్లోనూ ప్రజలు బెంజీన్‌ ప్రభావానికి గురవుతారని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొంది.

పారిశ్రామిక ఉద్గారాలు, వాహనాల ఉద్గారాలు, గ్యాస్ స్టేషన్లు, పొగాకు కాల్చడం ద్వారా వెలువడే పొగలో బెంజీన్ ఉంటుంది. ఆరు బయట వీటి ద్వారా వచ్చే బెంజీన్ తక్కువగా ఉంటుంది.

ఆరుబయట ప్రాంతాల కంటే మూసి ఉంచిన ప్రదేశాల్లో ఉండే గాలిలో సాధారణంగా బెంజీన్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది. రంగులు, ఫర్నీచర్ పాలిష్, డిటర్జెంట్స్, గ్లూ తదితర ఉత్పత్తులు బెంజీన్‌ను కలిగి ఉంటాయి.

ప్రమాదకర వ్యర్థాలు ఉండే చోట, గ్యాస్ స్టేషన్ల చుట్టూ ఉన్న గాలిలో మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ బెంజీన్ ఉంటుంది.

పొగాకు నుంచి వెలువడే పొగ బెంజీన్‌కు ప్రధాన వనరుగా ఉంటుంది.

ఒక వ్యక్తి చాలా కాలం పాటు బెంజీన్‌కు బహిర్గతం అయినప్పుడు, శరీరంలోని కణాల పనితీరును బెంజీన్ ప్రభావితం చేస్తుంది.

''ఉదాహరణకు, శరీరానికి సరిపడా ఎర్ర రక్త కణాలు వృద్ధి చేయకుండా ఎముక మజ్జను అడ్డుకుంటుంది. దీని వల్ల రక్త హీనత ఏర్పడుతుంది. దీంతో పాటు రక్తంలోని యాంటీబాడీల స్థాయిలను మార్చడం ద్వారా రోగ నిరోధక శక్తిని దెబ్బ తీస్తుంది. తెల్ల రక్త కణాలకు కూడా నష్టాన్ని కలిగిస్తుంది'' అని సీడీసీ వివరించింది.

సుదీర్ఘ కాలం పాటు బెంజీన్‌ ప్రభావానికి గురి కావడం వల్ల ప్రధానంగా రక్తంలో దానికి సంబంధించిన దుష్ఫలితాలు కనబడతాయి. ఇది, లుకేమియా వ్యాధికి దారి తీస్తుంది. లుకేమియా అంటే ఒక రకమైన రక్త క్యాన్సర్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Carcinogens in Shampoo ,UScompany recalling over 30 brands
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X