హీరో కమల్ హాసన్ మీద కేసు నమోదు: హిందూవుల్లో ఉగ్రవాదం ఉందంటారా, కోర్టులో విచారణ !
హీరో కమల్ హాసన్ కు మళ్లీ సినిమా కష్టాలుఉత్తరప్రదేశ్ లో కమల్ హాసన్ మీద కేసు నమోదుహిందూవుల్లో ఉగ్రవాదం ఉందని చేసిన వ్యాఖ్యలకు ప్రతిఫలం
న్యూఢిల్లీ: హిందూవుల్లో ఉగ్రవాదం ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బహుబాష నటుడు, దర్శకుడు కమల్ హాసన్ కు సినిమా కష్టాలు మొదలైనాయి. హిందూవులను కించపరిచేలా కమల్ హాసన్ వ్యాఖ్యలు చేశారని, ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఉత్తరప్రదేశ్ లో నమోదు అయిన కేసులో కమల్ హాసన్ మీద ఐపీఎస్ సెక్షన్ 500, 298, 295 (a),505 (c)సెక్షల కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం న్యాయస్థానం కేసు విచారణకు స్వీకరించింది. శనివారం కేసు విచారణ జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా అంటోంది.

హిందూవుల్లో ఉగ్రవాదం ఉందంటూ గురువారం హీరో కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక తమిళ వార పత్రికలో హిందూ ఉగ్రవాదంపై హీరో కమల్ హాసన్ సుదీర్ఘ వ్యాసం రాశారు. కమల్ హాసన్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు, హిందూ సంఘ, సంస్థలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.
కమల్ హాసన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కమల్ హాసన్ పిచ్చాసుపత్రిలో చికత్స చేయించుకోవాలని బీజేపీ నాయకులు సూచించారు. కమల్ హాసన్ నిత్యం ఏదో ఒక విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications