Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Coronavirus Cases: సౌత్ కంటే.. నార్త్ ఇండియాలోనే తగ్గుముఖం, ఏపీ, తమిళనాడులో నెమ్మదిగా..

న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో క్రమంగా కరోనా కేసులు భారీగా తగ్గున్నాయి. హర్యానాలో ప్రతి రోజు సగటును 8.9 శాతం కరోనా కేసులు పడిపోయాయి. రాజస్థాన్‌లో 8.5 శాతం, ఢిల్లీలో 8.2 శాతం, బీహార్ రాష్ట్రంలో 8.1 శాతం, యూపీలో 7.8 శాతం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 7.6 శాతం కరోనా కేసుల్లో తగ్గుదల కనిపించడం గమనార్హం.

Recommended Video

    COVID Delta Variant : అల్ఫా కంటే 50 శాతం ఎక్కువగా డెల్టా వేరియంట్ వ్యాప్తి ! || Oneindia Telugu
    ఏపీ, తమిళనాడులో నెమ్మదిగా కరోనా తగ్గుముఖం..

    ఏపీ, తమిళనాడులో నెమ్మదిగా కరోనా తగ్గుముఖం..

    ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయి కానీ, ఉత్తరాదితో పోల్చుకుంటూ అది తక్కువగా ఉంది. తమిళనాడులో 2.7 శాతం కేసులు తగ్గుముఖం పట్టగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4.2 శాతం క్షీణతను నమోదు చేశాయి. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తరాది రాష్ట్రాలు కరోనా నుంచి త్వరగా కోలుకుంటున్నాయని టైమ్స్ ఇండియా తన కథనంలో పేర్కొంది. అయితే, ఇందుకు నార్త్ ఇండియాలోని లీకర్ కోవిడ్ రిపోర్టింగ్ సిస్టమ్ కారణమై ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

    ఢిల్లీలో అతి తక్కువ పాజిటివిటీ రేటు

    ఢిల్లీలో అతి తక్కువ పాజిటివిటీ రేటు

    ఢిల్లీలో అతి తక్కువ పాజిటివిటీ రేటు 0.5 శాతం నమోదు కావడం గమనార్హం. తాజాగా, అక్కడ 381 కరోనా కేసులే నమోదయ్యాయి. మార్చి 15 నుంచి ఇదే కనిష్టం. 34 మంది చనిపోయారు. రెండు నెలల తర్వాత అతితక్కువ మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఢిల్లీలో24,591 మంది కరోనాతో మరణించారు.

    ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్..

    ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్..

    మరోవైపు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో భారత్ బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ కోవాగ్జిన్.. పిల్లలలపై క్లినికల్ ట్రయల్స్ సోమవారం నుంచి ప్రారంభించింది. ఇప్పటికే పాట్నా ఎయిమ్స్‌లో పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. 12-18ఏళ్ల వయస్కులైన పిల్లలపై ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి. 6-12 ఏళ్లు, 2-6ఏళ్ల పిల్లలకు కూడా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని పాట్నా ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఏడాదిలోపే పిల్లలకు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారత్ బయోటెక్ ప్రయత్నిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+