ఇక అంతా డిజిటల్: ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద 'నో క్యాష్'!
ఏప్రిల్ 10 నుండి దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద పూర్తిగా నగదు రహిత లావాదేవీలను తప్పనిసరి చేయనున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రకటించింది. ఇకపై అన్ని టోల్ ఛార్జీలను ఫాస్టాగ్ లేదా ఇతర డిజిటల్ చెల్లింపు పద్ధతుల ద్వారానే స్వీకరిస్తాయని స్వశతం చేసింది.
ఫాస్టాగ్ లేని వాహనాలు యూపీఐ ద్వారా టోల్ చెల్లించవచ్చు. అయితే వీరికి సాధారణ టోల్ రుసుముపై 1.25 రెట్లు అధికంగా వసూలు చేస్తారు. డిజిటల్ చెల్లింపు చేయడంలో విఫలమైతే, టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని నిలిపివేసే అధికారం ఉంది. అటువంటి సందర్భంలో, మూడు రోజులలోపు బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది, లేదంటే టోల్ మొత్తానికి రెట్టింపు ఫైన్ విధించబడుతుంది.

టోల్ మినహాయింపులు కఠినతరం అయ్యాయి. ప్రభుత్వ వాహనాలలో అధికారిక విధుల్లో వారికి మాత్రమే annual pass లేదా సరైన దరఖాస్తు ద్వారా మినహాయింపు లభిస్తుంది. ప్రభుత్వ అధికారులు వ్యక్తిగత ప్రయాణాలకు మినహాయింపు వర్తించదు. ఐడీ కార్డులు చూపించి టోల్ మినహాయింపు పొందే పాత విధానం పూర్తిగా రద్దైంది.
తరచుగా ప్రయాణించే వారికి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిని రాజ్‌మార్గ యాత్ర యాప్ లేదా NHAI మరియు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా పునరుద్ధరించవచ్చు. యూపీఐ, కార్డులు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు పూర్తయిన 24 గంటల్లో పాస్ యాక్టివేట్ అయ్యి, ఒక సంవత్సరం లేదా 200 టోల్ క్రాసింగ్‌ల వరకు చెల్లుబాటులో ఉంటుంది.
ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 1,200 టోల్ ప్లాజాలు ఉండగా, రోజువారీ ఫాస్టాగ్ లావాదేవీలు సుమారు 1.16 కోట్ల వరకు నమోదవుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి టోల్ వసూళ్లు ₹82,900 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications