కుల ఘర్షణ: ముగ్గురు దళితులను ట్రాక్టర్‌తో తొక్కించారు, మృతి
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలో దారుణం జరిగింది. భూ వివాదాలు ముగ్గురు దళితుల హత్యకు దారి తీశాయి. అగ్ర కులమైన జాట్స్, దళితులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదం ముగ్గురు దళితులను బలిగొంది.
వివరాల్లోకి వెళ్తే.. నాగౌర్ జిల్లాలోని దంగ్వాన్స్ గ్రామంలోని 20 హెక్టార్ల భూమి విషయంలో జాట్స్, దళితులకు మధ్య 1964 నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ భూ వివాదం కోర్టు దాకా కూడా చేరింది. అయితే భూ వివాదంపై గురువారం పంచాయతీ పెట్టారు. ఆ సమయంలోనే జాట్స్ వర్గానికి చెందిన వారు దళితులపై దాడి చేశారు.

దళితులపైకి ట్రాక్టర్స్‌ను తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ముగ్గురు దళితులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆగకుండా దళితులపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. వందలాది మంది దళితులపై విచక్షణారహితంగా దాడులు చేశారు.
మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి వారిపై దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలు మీడియాతో మాట్లాడుతూ.. తమ మర్మాంగాలపై ఇనుపరాడ్లతో దాడి చేసేందుకు యత్నించారని తెలిపారు. తమ వెంట్రుకలను పట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ వెళ్లారని చెప్పారు. తమ కాళ్లపై రాడ్లతో కొట్టారు అని చెప్పారు. గత కొన్ని సంవత్సరాల నుంచి జాట్స్ వర్గం వారు తమపై దాడులు చేస్తూనే ఉన్నారని తెలిపారు.
పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు. జాట్స్ వర్గంపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని దళిత హక్కుల సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దళితులకు సంబంధించిన వాహనాలకు జాట్స్ వర్గం వారు నిప్పు పెట్టారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications