Vandana Kataria: ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన తొలి ఇండియన్ ప్లేయర్‌కు ఘోర అవమానం-కులం పేరుతో...

కుల పునాదుల మీద ఒక జాతిని గాని నీతిని గానీ నిర్మించలేం అంటాడు డా.బాబా సాహెబ్ అంబేడ్కర్. అడుగడుగునా కుల గోడలు పాతుకుపోయిన సమాజంలో ప్రతీ మనిషికి సమాన గుర్తింపు,సమాన గౌరవం దక్కడం సాధ్యం కాదు. ఆ హెచ్చుతగ్గుల అసమానతలు శతాబ్దాలుగా కొన్ని కులాలను వెంటాడుతూనే ఉన్నాయి. కుల ముద్రలు కొందరికి కీర్తి కిరీటాలను తెచ్చిపెడుతున్న చోట... మరికొందరికి అవమానాలనే మిగులుస్తున్నాయి. ఈ వివక్ష చట్రంలో తాజాగా బలైనది భారత హాకీ ప్లేయర్ వందనా కటారియా...

ఓటమిలో కులాన్ని వెతికే ప్రయత్నం...

ఓటమిలో కులాన్ని వెతికే ప్రయత్నం...

టోక్యో ఒలింపిక్స్‌లో మొదటిసారి సెమీస్‌లో అడుగుపెట్టిన భారత మహిళల హాకీ జట్టు అర్జెంటీనా చేతిలో 2-1 తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో మొదటి గోల్ కొట్టింది భారతే అయినా... ఆ తర్వాత రెండు గోల్స్‌తో అర్జెంటీనా పైచేయి సాధించింది. దీంతో భారత్‌కు అర్జెంటీనా చేతిలో ఓటమి తప్పలేదు. అయితే ఈ ఓటమిలోనూ కొంతమంది కులాన్ని వెతికే ప్రయత్నం చేశారు. టీమ్‌లో దళిత ప్లేయర్లు ఎక్కువగా ఉండటం వల్లే సెమీస్‌లో ఓటమి ఎదురైందనే వాదన తెర పైకి తీసుకొచ్చారు.

వందనా కటారియా కుటుంబంపై కులం పేరుతో విమర్శలు...

వందనా కటారియా కుటుంబంపై కులం పేరుతో విమర్శలు...

సెమీస్‌లో భారత మహిళల హాకీ టీమ్ ఓటమి అనంతరం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉన్న భారత జట్టు హాకీ ప్లేయర్ వందనా కటారియా ఇంటి వద్దకు కొంతమంది వ్యక్తులు చేరుకున్నారు. ఆమె ఇంటి ముందు క్రాకర్స్ కాలుస్తూ,డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.ఆ సమయంలో వందనా కటారియా కుటుంబ సభ్యులు ఇంట్లో ఒలింపిక్ హాకీ మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు. అల్లరి మూక కేకలకు వారు బయటకు రాగా... మీ కులం వాళ్లు నేషనల్ టీమ్ ఎలా ఆడుతారంటూ హేళన చేశారు. హాకీ టీమ్‌లో దళితులు ఎక్కువగా ఉండటం వల్లే అర్జెంటీనాపై సెమీస్‌లో ఓడిపోయారని వ్యాఖ్యానించారు.

చుట్టుపక్కల వాళ్లే...

చుట్టుపక్కల వాళ్లే...

ఈ ఘటనపై వందనా కటారియా సోదరుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముగ్గురు,నలుగురు వ్యక్తులు తమ ఇంటి వద్దకు వచ్చి హాకీ టీమ్ ఓడిపోయినందుకు సెలబ్రేట్ చేసుకున్నారని... దానికి కారణం దళితులు టీమ్‌లో ఉండటమేనని విమర్శించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వ్యక్తులు తమ ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్లేనని తెలిపారు. వందనా సోదరుడి ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.'ఒలింపిక్స్‌లో భారత్ ఓటమి తర్వాత కొంతమంది వ్యక్తులు తమ ఇంటి వద్దకు వచ్చి కులం పేరుతో అవమానించినట్లు వందనా కటారియా సోదరుడు ఫిర్యాదు చేశాడు.నిందితులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశాం.' అని ఎస్‌ఎస్‌పీ సెంథిల్ అబుదై తెలిపారు.నిందితుల్లో ఒకరిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

తండ్రి పోత్సహంతో హాకీ స్టిక్ పట్టిన వందనా....

తండ్రి పోత్సహంతో హాకీ స్టిక్ పట్టిన వందనా....

వందనా కటారియా సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ఆమెకు హాకీ ఆట అవసరమా అని చుట్టుపక్కలవాళ్లు ఎన్ని విమర్శలు చేసినా... తండ్రి నహర్ సింగ్ ఆమెను ప్రోత్సహించాడు. ఎన్నో ఒడిదుడుకులను,ఆటంకాలను దాటుకుని తన ప్రతిభతో కటారియా జాతీయ జట్టులో చోటు సంపాదించుకుంది. ఒలింపిక్స్‌కి వెళ్లే ముందు బెంగళూరులోని ట్రైనింగ్ క్యాంప్‌లో ఉండగా ఆమె తండ్రి కన్నుమూశారు. రాక రాక వచ్చిన అవకాశం,తండ్రి తనపై పెట్టుకున్న నమ్మకం కోసం ఒలింపిక్‌లో ఆడాలని వందనా నిర్ణయించుకుంది.

ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు...

ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు...

దు:ఖాన్ని గుండెల్లో దాచుకునే ఒలింపిక్స్‌లో వందనా కటారియా సత్తా చాటింది. ఒలింపిక్స్ హాకీలో హ్యాట్రిక్ గోల్స్ చేసిన మొట్టమొదటి మహిళా హాకీ ప్లేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. ఫైనల్ పూల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై గెలుపులో వందనా చేసిన గోల్సే భారత్‌ను క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టేలా చేశాయి. గతంలో 2013లో వుమెన్ హాకీ జూనియర్ వరల్డ్ కప్‌లోనూ కటారియా సత్తా చాటింది. ఆ వరల్డ్ కప్‌లో టాప్ గోల్ స్కోరర్‌గా కటారియా నిలిచింది. భారత్ తరుపున కటారియా ఇప్పటివరకూ 200 గోల్స్ చేసింది.

కులం పేరుతో విమర్శించడంపై విమర్శలు

కులం పేరుతో విమర్శించడంపై విమర్శలు

ఇంత ప్రతిభ కలిగిన క్రీడాకారిణిని కులం పేరుతో హేళన చేయడంపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ ప్లేయర్స్‌ ప్రదర్శించిన జాత్యహంకార ధోరణిపై తీవ్ర స్థాయిలో స్పందించిన ఇండియన్ స్పోర్ట్స్ సంఘాలు,అభిమానులు వందనా కటారియాపై జరుగుతున్న దాడి పట్ల మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 'వందన కటారియా ఎదుర్కొంటున్న కుల విమర్శలు కొత్తేమీ కాదు. చుట్టుపక్కలవాళ్ల నుంచే ఈ పరిస్థితి ఎదురవుతుంది. కానీ చాలా సార్లు స్పోర్ట్స్ సర్కిల్ నుంచే మీరు దీన్ని ఎదుర్కొంటారు.' అని గ్రీష్మా కుతర్ అనే నెటిజన్ అభిప్రాయపడ్డారు. వందనా కటారియాపై కులం పేరుతో విమర్శలు చేస్తున్నవారు క్షమాపణలు చెప్పాలని మరికొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 2021లోనూ ఇంత కుల వివక్ష ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.ఇటీవల బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కాంస్యం సాధించిన సందర్భంలోనూ నెటిజన్లు ఆమె కులం గురించి గూగుల్‌లో సెర్చ్ చేసిన సంగతి తెలిసిందే.

కాంస్యం చేజారింది...

కాంస్యం చేజారింది...

మొదటిసారిగా సెమీస్‌లో అడుగుపెట్టి ఎన్నో ఆశలు రేకెత్తించిన మహిళల హాకీ టీమ్.. అర్జెంటీనా చేతిలో ఓటమి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ప్లేఆఫ్ పోరులో బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ ఓటమిపాలైంది. 3-4 తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. ఓటమిపాలైనప్పటికీ మహిళల హాకీ టీమ్ ప్రదర్శనపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+