డ్రైనేజీలో జారిపడ్డ ఎంపీ పూనమ్: గాయాలు(వీడియో)
జామ్‌నగర్: ఒక్కసారిగా డ్రైనేజీ పైకప్పు కూలిపోవడంతో దానిపైన నిల్చున్న గుజరాత్‌లోని జామ్‌నగర్ నియోజకవర్గ బిజెపి ఎంపీ పూనమ్ మాదమ్ అందులో పడిపోయారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. బీజేపీ ఎంపీ పూనమ్.. స్థానికంగా జాలారామ్‌నగర్‌లో ప్రజలు, అధికారులతో పలు సమస్యలపై మాట్లాడేందుకు అక్కడి వెళ్లారు. ఆమె ఓ డ్రైనేజీ పైకప్పుపై నిలుచుని స్థానిక ప్రజలతో మాట్లాడుతున్న సమయంలో దాని పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఎంపీ పూనమ్ ఆ డ్రైనేజీలో పడిపోయారు.
ఆ నాలా సుమారు 10 ఫీట్ల లోతు ఉంది. కాగా, ఈ ఘటనలో ఎంపీ కుడి కాలికి, తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వైద్య చికిత్స నిమిత్తం వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. పూనమ్‌తో పాటు డ్రైనేజీలో పడిపోయిన మరో ఇద్దరు మహిళలను కూడా ఆస్పత్రికి తరలించారు.

డ్రైనేజీ చుట్టు ఉన్న అక్రమ కట్టడాలను తొలగించేందుకు జామ్‌నగర్ మున్సిపాలిటీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఆ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు వచ్చిన ఎంపీ అక్కడున్న డ్రైనేజీపై నిలబడి మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు చెప్పారు.
మ్యాన్ హోల్స్‌పై పైకప్పులు నాణ్యతతో కూడి ఉండాలని అధికారులకు సూచిస్తున్న సమయంలోనే ఆ ఎంపీకి ఈ ప్రమాదం జరగడం గమనార్హం. ప్రస్తుతం సదరు ఎంపీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
WATCH: Moment when Jamnagar BJP MP Poonamben Madam fell into a drain in Jalla Ram Nagar in Gujarat, rushed to hosphttps://t.co/qrI8jVosox
— ANI (@ANI_news) May 16, 2016












Click it and Unblock the Notifications