ఫేస్‌బుక్‌లో వైరల్: కర్రలతో కొట్టి చంపారు (వీడియో)

తిరువనంతపురం: నలుగురు వ్యక్తులు కలిసి ఓ యువకుడిని కర్రలతో అత్యంత దారుణంగా కొట్టి చంపిన సంఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం షబీర్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి మోటార్ సైకిల్‌పై వెళుతుండగా అటుగా వచ్చిన నలుగురు యువకులు బైక్‌ని ఆపారు.

వెంటనే వారిద్దరిపై కర్రలతో దాడి చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో షబీర్ బైక్‌ను అక్కడ వదిలిపెట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కొద్ది దూరం వెళ్లినప్పటికీ, షబీర్‌ని వెంబడించిన ఆ నలుగురు యువకులు అతి దారుణంగా కొడుతుంటే అటుగా వెళ్లున్న ఓ వ్యక్తి దానిని వీడియో తీశారు.

ഇവന്മാർ ആരായാലും നിയമത്തിന്റെ മുന്പിൽ കൊണ്ടുവരണം പ്ലീസ് ഷെയർ

Posted by തമാശക്ക് തുടങ്ങിയതാണ് on Monday, February 1, 2016

అనంతరం ప్రాణాపాయ స్థితిలో ఉన్న షబీర్‌ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. 46 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోని తీసిన వ్యక్తి సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో విషయం బయటకు వచ్చింది.

ఇప్పటి వరకు ఈ వీడియోని 1,73, 000 మంది వీక్షించారు. 12,000 మంది వరకు ఈ వీడియోని షేర్ చేశారు. అయితే పోలీసులు వీడియో తీసిన వ్యక్తి వివరాలు వెల్లడించలేదు. వీడియో పుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యువకుడిని కొట్టిన నలుగురు వ్యక్తుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే నలుగురు నిందితుల్లో ఒకడితో షబీర్ గతేడాది గొడవపడినట్లుగా పోలీసులు గుర్తించారు. షబీర్ మృతికి పాత కక్షలే కారణమని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+